Comedian ali be honoured with doctorate

comedian ali, tollywood, honoured with doctorate

Comedian Ali will be honored with a doctorate. ACADEMY OF UNIVERSAL GLOBAL PEACE will confer honorary doctorate to Ali on 25th May, 2013 at Coimbatore.

ఆలీకి డాక్టరేట్ వచ్చింది

Posted: 05/18/2013 07:48 PM IST
Comedian ali be honoured with doctorate

గత మూడు దశాబ్దాల నుండి కమేడియన్ గా ప్రేక్షకుల్ని నవ్విస్తూ వస్తున్న ఆలీని మన వారు గుర్తించపోయినా, ఆయనను ప్రక్క ప్రాంతం వారు గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది. ఆయనకు యూరోపియన్ యునైటెడ్ యూనివర్శిటీ  డాక్టరేట్ ను ప్రదానం చేస్తోంది.ఈ నెల ఇరవైఐదున కోయంబత్తూరులో ఆలి డాక్టరేట్ అందుకుంటున్నారని సమాచారం. ఇక ఆయన సినీ జీవితంలోకి ఓ సారి తొంగి చూస్తే చిన్నప్పుడే నటన పై మమకారం  పెంచుకొని వేషాల కోసం ఎన్నో పాట్లు పడి చివరికి భారతీరాజా చిత్రంలో ఓ పాత్ర ద్వారా 1980 లో సినిమా ప్రస్థానం ప్రారంభించిన ఆలీ తరువాత అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డాడు. తరువాత  అలీబాబా అరడజను దొంగలు, యమలీల, పిట్టల దొర చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆ తరువాత వరుస అవకాశాలతో పెద్ద సినిమాల్లో నేటికీ నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళకైనా ఆలీకి డాక్టరేట్ వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలియజేద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles