Toolywood news super star krishna birthday gift on mahesh babu

super star krishna, prince mahesh babu, super star krishna birthday, new movie trailer, tollywood news, mahesh babu latest news, birthday gify, super star krishna birthday may 31th,

super star krishna birthday gift on mahesh babu

తండ్రి జన్మదిన కానుకగా...!

Posted: 05/12/2013 11:40 AM IST
Toolywood news super star krishna birthday gift on mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ క్రిష్ణ కోసం .. ప్రిన్స్ మహేష్ బాబు సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. తన తండ్రి జన్మదిన కానుకగా ఒక మంచి గిప్ట్ ఇవ్వబోతున్నాడు. మహేష్ కథానాయకుడిగా సుకుమార్ ఓ రొమాంటిక్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతిసనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 31న సూపర్‌స్టార్ కృష్ణ జన్మదిన కానుకగా విడుదల చేయబోతున్నారని చిత్ర వర్గాల సమాచారం.

తొలిసారిగా ఇందులో మహేష్ ఆరుపలకల దేహంతో కనిపించబోతున్నాడని ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ మొత్తం 45 రోజులు వుంటుందని, ఈ షెడ్యూల్‌లో కొంత చిత్రీకరణ జరిపాక చిత్ర యూనిట్ యూరప్‌కు వెళుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles