Hero nitin got bumper offer

nitin hero, nitin multi starrer movie, puri jagannath director, nitin busy, nitn commit another movie, nitin-sukumar movie, sukumar director

nitin hero, nitin multi starrer movie, puri jagannath director, nitin busy, nitn commit another movie, nitin-sukumar movie, sukumar director

నితిన్ పూరీ దర్శకత్వంలో

Posted: 05/13/2013 02:59 PM IST
Hero nitin got bumper offer

‘కాలం కలిసి వస్తే... నడిసొచ్చొ కొడుకు పుడుతాడనే ’ సామెత యంగ్ హీరో నితిన్ కి బాగా అతికినట్లు సరిపోతుంది. ఆ మధ్యన వరుస ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమైన నితిన్ కి ‘ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే ’ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పడు ఈ హీరోకి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. వచ్చేవి ఆషా మాషీ ఆఫర్లు కాదు... స్టార్ డైరెక్టర్లు ఈ యంగ్ హీరోతో సినిమాలు తీయడానికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ’ చిత్రంలో బిజీ గా ఉన్న ఈయన ప్రేమ కథా చిత్రాల దర్శకుడు అయిన సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫాస్టెస్ట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నితిన్ తో సినిమా తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పూరి తీయబోయే మల్టీ స్టారర్ చిత్రంలో నితిన్ కి ఇఫ్పటికే స్టోరీ చెప్పేశాడట. స్టోరీకి ఫిదా అయిపోయిన నితిన్ వెంటనే ఓకే చెప్పేశాడట. మరో హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. మిగతా నటులు ఎంపిక అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడట. నితిన్ మార్కెట్ వ్యాల్యూ బాగానే ఉండటంతో పెద్ద వాళ్లతో తీసి చేతులు కాల్చుకోవడం కంటే, ఇలాంటి యంగ్ హీరోతో తీయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు ప్రముఖ దర్శకులు. ఏమైనా నితిన్ కి కాలం కలిసి వస్తుందనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles