Viswaroopam movie released

viswaroopam movie, viswaroopam movie release, viswaroopam movie on screens, viswaroopam movie court issue, viswaroopam movie ban, viswaroopam movie teaser, viswaroopam movie posters, viswaroopam movie wallpapers, kamal, kamal hassan

viswaroopam movie released

3.gif

Posted: 01/25/2013 11:54 AM IST
Viswaroopam movie released

           vvv

       విలక్షణ జాతీయనటుడు కమల్ హాసన్  ‘విశ్వరూపం’ ఎట్టకేలకు కొన్ని పరిమితులకు లోబడి ఈరోజు విశ్వవ్యాప్తంగా విడుదలైంది.  అయితే రాజధాని చిత్రానికి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో చిత్రప్రదర్శనకు  బ్రేక్ పడింది. ఈచిత్రాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పోలీసులను ఆదేశించారు. ఇదిలాఉంటే తమిళనాట వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న 'విశ్వరూపం' సినిమా ప్రదర్శనపై నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. 26న చిత్రాన్ని చూసిన తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఈ చిత్రం వివాదం ఆంధ్రప్రదేశ్ కి కూడా పాకటంతో హోంమంత్రి పై నిర్ణయం తీసుకున్నారు.      

         ఈ సినిమా విడుదలను ఆపివేయాలని కోరుతూ ముస్లిం సంఘాలు నిన్న హైదరాబాదు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశాయి.  అయితే విశ్వరూపం చిత్రాన్ని నిలిపివేయాలని హోంమంత్రి నుంచి తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు అందలేదని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. చిత్రాన్ని నిలిపివేయాలని తాము ఎవరినీ ఆదేశించలేదని ఆయన చెప్పారు.
         అయితే.. కొద్ది సేపటి క్రితం అందిన అధికారిక సమాచారం మేరకు.. హైదరాబాద్‌, సికింద్రబాద్‌ పరిధిలోని థియేటర్లలో విశ్వరూపం సినిమా ప్రదర్శన నిలివేయాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ సినిమాను నిలిపేశారు. ఈ నిలిపివేత ఆదేశాల జనవరి 28 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపేసినట్టు కనిపిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన విశ్వరూపం సినిమాను తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పటికే నిషేధించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి రేపు ఈ సినిమాను చూసి నిషేధంపై నిర్ణయాన్ని 28న ప్రకటిస్తానన్న విషయం మనకు విదితమే..
         కాగా విశ్వరూపం చిత్ర విడుదల వివాదాస్పదం అవుతూండటంతో స్వచ్ఛందంగా చిత్రాన్ని నిలిపివేయాలని కొన్ని సున్నిత ప్రాంతాల్లోని ధియేటర్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

        ఇదిలా ఉండగా, విశ్వరూపం చిత్రంపై తమిళనాడులో నిషేధం విధించిన నేపథ్యంలో కమల్ హాసన్ కు రజనీకాంత్ అండగా నిలిచారు. నలభై ఏళ్లుగా కమల్ తనకు బాగా తెలుసని, ఎవరినీ కించపరిచేలా కమల్ హాసన్ సినిమాలు తీయరని చెన్నైలో వెల్లడించారు. అందరూ అర్థం చేసుకుని సినిమా విడుదలకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు విశ్వరూపం చిత్రం విడుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పోలీసు ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.
           తెలుగువిశేష్.కాం కు వివిధ ప్రాంతాలనుంచి అందుతోన్న వివరాల మేరకు ఆంధ్రరాష్ట్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది...
      దశావతారాలూ చూపించి ఇప్పుడు ‘విశ్వరూపం’ చూపించేందుకు సిద్ధపడ్డ కమల్ ప్రతిష్టాత్మక సినిమా రివ్యూ మీకోసం..  ఎన్నో అవరోధాల నడుమ ఇవాళ రిలీజైన ఈ చిత్ర సమీక్షకోసం ఈ దిగువ లింక్ క్లిక్ చేయండి..

http://www.teluguwishesh.com/teluguhome/200-movie-reviews/41721-viswaroopam-movie-review.html

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eyy telugu movie audio
Nara rohit and regina new movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles