7g sonia agarwal new movie

7/G sonia agarwal new movie

7/G sonia agarwal new movie

19.gif

Posted: 07/31/2012 05:00 PM IST
7g sonia agarwal new movie

     sonia 7/జి బృందావన కాలనీ' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సోనియా అగర్వాల్‌ తాజాగా 'కథానాయకి' అనే విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఎస్వీఆర్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్‌ మీడియా అధినేత్రి శోభారాణి చిత్ర విశేషాలు వివరించారు.sobha_rani
        'సినీ కథానాయకి జీవితం పూలపాన్పు కాదు, ఒక ముళ్లకంచె అని, వాళ్ళూ మనుషులేనని, వాళ్ళకీ మనసుంటుందని తెలియజెప్పే చిత్రమిది. కథానాయకి కావాలని, స్టార్‌డమ్‌ సంపాదించుకోవాలని ఎన్నో ఆశలతో వచ్చినవారికి అడుగడుగునా ఎదురయ్యే కష్టాలు, ఎదురుదెబ్బలు, వారి గుండె లోతుల్లోని కన్నీళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు రాజ్‌కృష్ణ. ఈ చిత్రకథ ఎంతో సున్నితమైనది. ఆ సున్నితత్వాన్ని మనసుకు హత్తుకునేలా చూపించాలంటే ఎంతో కేర్‌ తీసుకోవాల్సి వుంటుంది. ఇలాంటి పాయింట్‌తోనే ఇటీవల రిలీజ్‌ అయిన డర్టీ పిక్చర్‌ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే మా 'కథానాయకి' కూడా సంచలన విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. 7/జి తర్వాత సోనియా అగర్వాల్‌ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రమిదే. ఈ చిత్రం తనకి మంచి పేరు తెస్తుందని ఎంతో నమ్మకంగా వున్నారు సోనియా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan scares for aunty
Aaroju eem jarigindi new telugu dubbing movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles