అందాల తారలు సదా, స్నేహా ఉల్లాల్, రియాసేన్, దేశ్ముఖ్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఓ తమిళ చిత్రం 'ఆరోజు' పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. 'ఏం జరిగింది?' అనే ఉప శీర్షిక. గ్లామర్ ఓరియంటెడ్ హర్రర్ చిత్రమిది. ప్రఖ్యాత ఛాయాగ్రాహకులు, దర్శకులు సంతోష్ శివన్ సోదరుడు సంగీత్ శివన్ ఈ చిత్రానికి దర్శకులు, ఛాయాగ్రాహకులు కావడం విశేషం. నివేద స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో ప్రముఖ నిర్మాత అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ మరియు రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సదా, స్నేహా ఉల్లాల్, రియాసేన్ల గ్లామర్, కథాంశంలోని నవ్యత, ముఖ్యంగా హార్రర్, సంగీత్ శివన్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. ఆరోజు అసలేం జరిగిందనేదే చిత్ర ఇతివ్రుత్తాంతంగా సాగుతుంది.
ఈ చిత్రానికి సంగీతం: శర్మ, పాటలు: పొందూరి, యం.రామారావు, మాటలు: అడ్డాల వెంకట్రావు, ఎడిటింగ్: ఎల్.రామారావు, కో-ప్రొడ్యూసర్: అరుణ్, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావు-ఎ.సెల్వం, ఛాయాగ్రహణం- చిత్రానువాదం-దర్శకత్వం: సంగీత్ శివన్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more