Brahmanandam facebook request

Brahmanandam facebook Request

Brahmanandam facebook Request

Brahmanandam Request.gif

Posted: 07/19/2012 04:49 PM IST
Brahmanandam facebook request

brahmanandam

టాలీవుడ్ లో నవ్వుల బ్రహ్మగా కీర్తి సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. టాలీవుడ్ లో ఆయన లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మానందం తెర పై కామెడీ చేసి నవ్విస్తుంటే... కొందరు మాత్రం ఆయన అవతారాలను మార్ఫింగ్ చేసి వికృతానందాన్ని పొందుతున్నారు. గత కొంత కాలంగా నెట్లో బ్రహ్మానందం మార్పింగ్ ఫోటోలు వివిధ వ్యక్తులను పోలి, వివిధ సినిమా హీరోలను పోలి మనకు దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలక్రిష్ణ లాంటి పెద్ద హీరోలకు ఇలాంటిదే ఎదురైంది. ఆయన ఒక హీరో కాబట్టి దీని పై స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  దానికి సంబంధించిన వారిని పోలీసులు పట్టుకోవడంతో ఆయన ఫోటోలకు అడ్డుకట్ట పడింది.

ఎలాగు కామెడీ యాక్టర్ కాబట్టి ఈ ఫోటోల పై స్పందించిన బ్రహ్మానందం తన ఫేస్ బుక్ లో ఒక విన్నపాన్ని ఉంచారు. ''ఫేస్ బుక్ అభ్యర్ధులకు నా అభ్యర్ధన! మీరు నామీద ఎన్ని జోకులైనా వేసుకోండి ... కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి ... నేను పుట్టిందే మిమ్మల్ని నవ్వించడం కోసం. అంతేగానీ నాపేరు తగిలించి ఇతరులను అవమాన పరచకండి ... అది నన్నెంతగానో బాధిస్తోంది.'' అంటూ పేర్కొన్నారు. ఈ అభ్యర్థను చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా ఆయనకు బాసటగా నిలిచి, ఆయన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. మరి బ్రహ్మానందం చేసిన ఈ అభ్యర్ధనని, రాజమౌళి చేసిన ప్రచారంతోనైనా ఇలాంటి ఫోటోలకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karthi remuneration is 13crores
Censor board refused to certify sunny leone jism 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles