Anil ambani and ar rehman in oscar

anil ambani and ar rehman in oscar

anil ambani and ar rehman in oscar

11.gif

Posted: 02/27/2012 04:37 PM IST
Anil ambani and ar rehman in oscar

            red 84వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఆటపాటతో అందర్ని ఆకట్టుకున్నారు. హాన్స్ జిమ్మర్ నేతృత్వంలోని ఆస్కార్ సూపర్ బ్యాండ్‌తో కలిసి రెహ్మాన్ ప్రదర్శన ఇచ్చారు. ‘127 హవర్స్’ చిత్ర ట్రాక్స్‌తో రెహ్మాన్ ప్రేక్షకుల్ని రంజింపచేశారు. 2009 సంవత్సరపు అవార్డుల్లో రెండు అస్కార్‌లను సొంతం చేసుకుని రెహ్మాన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. anil_and_red
         ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో మరో విశేషమేమిటంటే,  అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డ్రీమ్ వర్క్స్ తన ప్రత్యేకతను చాటుకుంది. అస్కార్ అవార్డుల రేసులో రిలయన్స్ డ్రీమ్ వర్క్స్ రూపొందించిన 11 చిత్రాలు నామినేట్ అయ్యాయన్న సంగతి మీకు కొన్నాళ్ల క్రితమే వివరించాం. ఈ సంస్థ  స్టివెన్ స్పీల్‌బెర్గ్‌తో కలిసి వార్ హార్స్, టేట్ టేలర్‌తో ది హెల్ప్ చిత్రాలను నిర్మించింది.ar_rah
           స్పీల్ బర్గ్ వార్ హార్స్ చిత్రం ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్కోర్, ఆర్ట్ డెరైక్షన్, సినిమాటోగ్రఫి శాఖల్లో నామినేట్ కాగా, ఉత్తమ చిత్ర కేటగిరిలో ది హెల్ప్, ఉత్తమ నటి వయోలా డెవిస్, ఉత్తమ సహాయ నటి జెస్సికా చాస్టెయిన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో రియల్ స్టీల్ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అవార్డుల కార్యక్రమంలో భాగంగా స్పీల్‌బర్గ్‌తో కలిసి అనిల్ అంబానీ, టీనా అంబానీలు రెడ్ కార్పెట్‌పై హుందాగా నడిచి వచ్చారు. దీంతో ఆస్కార్ లో భారత్ సామర్థ్యాన్ని చాటినట్టైంది.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej rachha movie hindi rights
Film actor vakkada apparao sons marriage photos  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles