Samsung Galaxy J7 Pro and J7 Max launched సామ్ సంగ్ నుంచి మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు

Samsung galaxy j7 pro j7 max with pay mini launched in india

samsung, samsung galaxy j7 max, galaxy j7 max price in india, galaxy j7 max specs, galaxy j7 max first impressions, galaxy j7 max features, galaxy j7 max pricing, mobiles, smartphones

Samsung Galaxy J7 Max, J7 Pro have been launched in India at a price of Rs 17,900 and Rs 20,900 respectively.

సామ్ సంగ్ నుంచి మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు

Posted: 06/14/2017 08:56 PM IST
Samsung galaxy j7 pro j7 max with pay mini launched in india

స్మార్ట్ ఫోన్ల లవర్స్ మీకో గుడ్ న్యూస్.. మీ అంచనాలకు తగ్గట్టుగా మరో రెండు కొత్త 4జీ స్మార్ట్ ఫోన్లు భారతీయ విఫణిలోకి వస్తున్నాయి. మొబైల్ రంగంలో రారాజుగా ముందుకు సాగుతున్న దిగ్గజ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7  ప్రొ పేరుతో వీటిని లాంచ్ చేస్తున్నట్టు పేర్కొంది. వీటి ధరలు 17,900 రూపాయలుగా, 20,900 రూపాయలుగా ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ జూన్ 20 నుంచి అందుబాటులోకి వస్తుండగా.. గెలాక్సీ జే7 ప్రొ జూలైలో స్టోర్లలోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ కొనుగోలుచేసిన రిలయన్స్ జియో కస్టమర్లకు నెలవారీ రీఛార్జ్ రూ.309పై అదనంగా 10జీబీ డేటాను 12నెలల పాటు ఇవ్వనున్నట్టు తెలిపింది. అంటే 120జీబీ డేటా వరకు వీరికి ఉంచింది.  ఈ స్మార్ట్ ఫోన్లతో పాటు కంపెనీ శాంసంగ్ పే మినీ పేమెంట్ సొల్యుషన్ ను లాంచ్ చేసింది.
 
శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ ప్రత్యేకతలు

5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే
1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్
1.6 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6757వీ ప్రాసెసర్
4జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(ఎస్డీ కార్డుతో మరింత విస్తరించుకోవచ్చు)
13ఎంపీ మెగాపిక్సెల్ తో వెనుక, ముందు వైపు కెమెరాలు
ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
3300ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్
4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ
 
శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రొ ప్రత్యేకతలు

5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
1.6గిగాహెడ్జ్ ఎక్సీనోస్ 7870 ప్రాసెసర్
3జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఎస్డీకార్డుతో స్టోరేజ్ ను విస్తరించుకునే అవకాశం
ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
3600 ఎంఏహెచ్ బ్యాటరీ
13 మెగాపిక్సెల్ ముందు, వెనుక వైపు కెమెరాలు
ఫింగర్ ప్రింట్ సెన్సార్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung  Galaxy  J7 Pro  Galaxy J7 Max  launch  indian market  

Other Articles