జెట్ ఎయిర్ వేస్ వాలెంటైన్స్ డే చౌకధరలు Jet Airways offers Valentine's Day Sale

Jet airways offers all inclusive rs 999 fare in valentine s day sale

Jet Airways,Jet Airways Valentines Day offer,Valentines Day offer,Zoom Air,Vistara,Vistara Valentines Day offer,Jet Airways scheme,Jet Airways special fares

Jet Airways' this scheme comes on the heels of Vistara announcing all-inclusive one-way fares starting Rs. 899 on economy class travel under a promotional "Valentine's Day Sale".

విస్తారా తరువాత జెట్ ఎయిర్ వేస్ వాలెంటైన్స్ డే చౌకధరలు

Posted: 02/14/2017 08:03 PM IST
Jet airways offers all inclusive rs 999 fare in valentine s day sale

వాలెంటైన్స్ డే ప్రేమికుల రోజును జోష్ తో ఎంజాయ్ చేసే జంటలకు విమానయాన సంస్థలు మరింత సరికోత్త జోష్ ను అందిస్తున్నాయి. అత్యంత చౌకధరలో గగన వీధుల్లో విహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రోజును పురస్కరించుకుని విమానయాన సంస్థ విస్తారా అన్ని ఖర్చులు కలుపుకుని రూ.899 నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను వెల్లడించింది. దీంతోపాటు బిజినెస్ క్లాస్, ఎకానమీ, ప్రీమియం ఎకానమీ స్పెషల్‌ డిస్కౌంట్‌ను  ప్రకటించిన నేపథ్యంలో మరో విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ కూడా ఇదే తరహా డిసౌంట్ ను ప్రకటించింది.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థ నాలుగు రోజుల పాటు డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. అన్నీకలిపి దేశీయ రూట్లలోరూ.999 నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను ఇవాళ్టి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాలెంటైన్స్ డే వేడుకలు లక్ష్యంగా భాగంగా ఫిబ్రవరి 17 లోపు బుక్‌ చేసుకునే వారికే ఈ ప్రత్యేక ఆఫర్‌ టికెట్లతో దేశీయ నెట్‌ వర్క్‌ ద్వారా  మార్చి 17, 2017 దాకా ప్రయాణించేందుకు అవకాశం ఉందని జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

అలాగే ఫిబ్రవరి 14, 15తేదీలు తమ ఎయిర్‌ లెన్స్‌ ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరో లక్కీ ఆఫర్‌ కూడా ప్రకటించింది. సెలెక్టెడ్‌ జెట్‌ విమానాల్లో ప్రయాణించే లక్కీ ప్రయాణికులకు వెంటనే చేసుకునే  తదుపరి బుకింగ్లో ప్రత్యేక తగ్గింపు ధరను అందించనున్నట్టు తెలిపింది. తామిచ్చే ప్రోమోకోడ్‌ ద్వారా నిబంధనల ప్రకారం తదుపరి రిటర్న్‌ జర్నీలో రూ.500 తగ్గింపు అందించనున్నట్టు తెలిపింది. సందర్భానికి తగినట్టుగా అద్భుతమైన ప్రమోషన్లు, ప్యాకేజీలను  అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ జయరాజ్ షణ్ముగం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways  Discount sale  Valentine's Day  Sale  vistara valentine's day offers  

Other Articles

Today on Telugu Wishesh