పెద్ద నోట్ల రద్దుతో దెబ్బకు దిగివచ్చిన టోకు ధరల ద్రవ్యోల్భణం WPI inflation eases to 3.2% in November 2016

Wholesale inflation falls to five month low of 3 15 in november

Demonetisation, Inflation, Monetary Policy Committee, RBI governor urjit patel, Wholesale Price, WPI

Wholesale inflation eased for the third straight month as it fell to 3.15 percent in November after subdued demand due to demonetisation led to softening of prices of vegetables and other kitchen staples.

పెద్ద నోట్ల రద్దుతో దెబ్బకు దిగివచ్చిన టోకు ధరల ద్రవ్యోల్భణం

Posted: 12/14/2016 06:12 PM IST
Wholesale inflation falls to five month low of 3 15 in november

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత వాటి ఫలితాలు ఎలా వుంటాయన్న అందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఫలితాలు దీర్ఘకాలికంగా వుంటాయని, అందుకోసం కొన్నేళ్లు అగాల్సివస్తుందని కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. అయితే టకు ధరల సూచీల ద్రవ్యల్భాణానికి సంబంధించిన అంశంలో మాత్రం అప్పుడే ఫలితాలు వెల్లడయ్యాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. వరుసగా మూడో పర్యాయం కూడా టోకు ధరల సూచీల ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టింది.

టోకు ధరల సూచీ 3.15 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో -2.04శాతంతో పోలిస్తే నవంబర్ నెలలో 3.15వద్ద నిలిచిందని కేంద్రం వెల్లడించిన గణంకాలు తెలుపుతున్నాయి. అక్టోబర్లో ఇది 3.39శాతం గా ఉంది. నవంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్' అధికారిక డబ్ల్యుపిఐ 0.1శాతం ఎగిసింది 183.1 (తాత్కాలిక) కు మునుపటి నెలలో 182.9 నుండి పెరిగింది. ప్రాథమిక వస్తువుల సూచి 0.9 శాతం తగ్గివంది.మునుపటి నెలలో 261.8 (ప్రొవిజనల్) శాతంతో పోలిస్తే 259.4 శాతానికి తగ్గింది. తయారుచేయబడ్డ ఉత్పత్తుల సూచి నవంబర్లో 0.3శాతం పెరిగి157.9 గా నమోదైందని  మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరులో రెండేళ్ల కనిష్ఠానికి దిగొచ్చి  3.63 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.20 శాతం ఉంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలతో పాటు పలు ఆహార వస్తువుల ధరలు చౌకగా మారడం ఇందుకు కలిసొచ్చింది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదైన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ఠ స్థాయి. 2015 ఆగస్టులో 3.66 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. 2015 నవంబరులో ఇది 5.41 శాతంగా మళ్లీ పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Inflation  Monetary Policy Committee  Wholesale Price  

Other Articles