Short covering lifts Sensex 267 pts, Nifty up 1%

Sensex nifty consolidate second day gains

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Overall the market has been rangebound and in fact, it has been trying to hold 7000 level on the Nifty as a support, at least till the Union Budget.

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ కు 267 పాయింట్ల లాభం

Posted: 02/18/2016 06:40 PM IST
Sensex nifty consolidate second day gains

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను ఆర్జించాయి. అసియా మార్కెట్ల నుంచి వచ్చన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను గడించాయి. దీనికి తోడు చమురు రంగానికి సంబంధించిన షేర్లలో లాభాలు వెల్లువెత్తడం కూడా మార్కెట్లకు కలసివచ్చింది. ఐరోపా మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ పవనాలతో నిఫ్టీ 7 వేల రెండు వందల మార్కును చేరుకోవడంలో విఫలమైయ్యింది. ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు చివరి నిమిషంలో లాబాలను హరించాయి. అయితే అన్ని సూచీలు ఇవాల లాభాలలో పయనించాయి.

అంతకుముందు 350 పాయింట్ల మేర అర్జించిన లాభాలను సెన్సెక్స్ స్వల్పంగా చేజారుకుంది 267 పాయంట్ల లాభానికే పరిమితం అయ్యింది. అటు నిఫ్టీ కూడా 7 వేల 2 వందల పాయిట్లను తాకిన చివరకు అ మార్కులోపలే ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 267 పాయింట్ల లాభాన్ని అర్జించి 23,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 83 పాయింట్ల లాభంతో 7,192 పాయింట్ల వద్దకు ముగిసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హిండాల్కో, ఒఎన్జీసీ, కాయిర్న్ ఇండియా, హీరో మోటో కార్ఫ్, తదితర కంపెనీల షేర్లు లాభపడగా, మారుతి సుజుకీ, అసియా పెయింట్స్, బిహెచ్ఇఎల్, రిలయన్స్, యాక్సిక్ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles