First black monday to stock markets

First black monday to stock markets

Stock Market, India, Sensex, Nifty, Stocks, Black monday, China market, Asian market

The benchmark BSE Sensex tanked by over 538 points in one of its worst falls in over three months to 25,622.87, tracking global sell-off amid concerns over slowdown in China and escalating tension in the Middle East. In addition, India’s manufacturing sector output shrinking to a 28-month low in December and fresh weakness in the rupee, accelerated selling activity.

స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండే

Posted: 01/04/2016 04:51 PM IST
First black monday to stock markets

స్టాక్ మార్కెట్లకు మరోసారి భారీ షాక్ తగిలింది. నిన్నటి నుండి నష్టాల బాటలో నడుస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదేదోవలో నడిచింది. సెన్సెక్స్ 530 పైగా పాయింట్లను  కోల్పోగా, నిఫ్టీ 170  పాయింట్లు క్షీణంచింది.  ముఖ్యంగా  నిఫ్టీ గట్టిమద్దతు స్థాయి  7800 పాయింట్లకు దిగజారింది. ఆసియా మార్కెట్లలోని పతనం దేశీయ మార్కెట్లను  ప్రభావితం చేస్తోందని, చైనా మార్కెట్లు భారీగా పడిపోవడమే మన మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టెలికాం, బ్యాంకింగ్ రంగంలోని నష్టాలు మార్కెట్ను బాగా కృంగదీశాయి.  

ఎయిర్ టెల్ , ఐడియా షేర్లలో అమ్మకాల వత్తిడితో .. 3.5 శాతానికి పైగా నష్టాలతో మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లాయి.  టాటా మోటార్స్, సన్ ఫార్మా, యం  అండ్ యం, ఆయిల్ తదితర రంగాల్లో కూడా ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. అటు యూరోప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే  కొనసాగుతున్నాయి. కాగా పసిడి  ధరలు లాభాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ-50లో కేవలం 4 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. గతవారం చివర్లో మార్కెట్ కాప్ తో పోలిస్తే, ఇప్పటికే దాదాపు రూ. లక్షన్నర కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stock Market  India  Sensex  Nifty  Stocks  Black monday  China market  Asian market  

Other Articles