Mid cap smallcap stocks crash up to

Mid-cap shares crash, small-cap crash, Sebi probe, Core Projects shares, Welcorp, Aanjaneya Lifecare, ABG Shipyard, Flexituff shares

Financial express latest business and finance news: Mid-cap, small-cap shares crash up to 60%, Sebi starts probe

Mid-cap- smallcap stocks crash up to.png

Posted: 02/26/2013 08:28 PM IST
Mid cap smallcap stocks crash up to

small-cap-sharesవారారంభంలో ఇన్వెస్టర్లకు ఊహించని షాక్ త గిలింది. మిడ్ సెషన్‌లో ఉన్నట్టుండి పలు మిడ్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. కొన్ని మధ్య, చిన్న తరహా షేర్లలో అమ్మకాలు ఏ స్థాయిలో సాగాయంటే... మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగి ఈ పతనంపై దర్యాప్తును చేపట్టినట్లు ప్రకటించాల్సి వచ్చింది. అయితే తొలుత 10-12 షేర్లలో ప్రారంభమైన పతన ప్రభావం ఆపై పలు షేర్లపైకి మళ్లింది. వెరసి బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండె క్స్‌లు 1.3% స్థాయిలో నీరసించాయి. ఎడ్యుకేషన్ సంస్థ కోర్ ప్రాజెక్ట్స్ ఏకంగా 62% కుప్పకూలగా, ఆంజనేయ లైఫ్‌కేర్, సుదార్ ఇండస్ట్రీస్, ఫ్లెక్సీటఫ్, ఏబీజీ షిప్‌యార్డ్, వెల్‌స్పన్ కార్ప్, ఆర్బిట్, ఆప్టో సర్క్యూట్స్, డీబీ రియల్టీ, కెర్నెక్స్ మైక్రో, హిందుస్తాన్ ఆయిల్, ఎస్సార్ పోర్ట్స్, బెర్జర్ పెయింట్స్, ఏజీసీ నెట్‌వర్క్స్, పెనిన్సులార్, గోవా కార్బన్ తదితరాలు 20-7% మధ్య దిగజారాయి. ఈ బాటలో ట్రేడైన షేర్లలో 1,789 నష్టపోగా, కేవలం 974 లాభపడ్డాయి.స్టాక్ ఎక్స్ఛేంజీలతో కలసి సెబీ ఈ అమ్మకాలపై దర్యాప్తును ప్రారంభించిందన్న వార్తలతో చివర్లో కొంతమేర రికవరీ కనిపించింది. కాగా, ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సైతం మిడ్ సెషన్‌లో లాభాల నుంచి నష్టాలలోకి మళ్లాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగియడం ద్వారా ఇన్వెస్టర్లకు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 19,332 వద్ద నిలవగా, నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 5,855 వద్ద స్థిరపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Etihad announces deal with jet airways
Five hundred rupees note  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles