kurnool-sangameswara-temple-history సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

Telugu content

Kurnool Sangameswara Temple, kurnool lord shiva temple, kurnool temple history, lord shiva temples, kurnool shiva temple history, 7 rivers meet up temple, telugu mythological stories

Kurnool Sangameswara Temple History 7 Rivers Alignment Place Lord Shiva Mythological Stories The History Of Sangameswara Temple Which Is Located In Kurnool District Where 7 Rivers Meet Up.

సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

Posted: 08/21/2017 08:06 PM IST
Telugu content

అది వేల సంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మహర్షులు, మునులు, సాదువులు తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన సంఘమ ప్రదేశం.. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి వుంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది... సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

స్థలపురాణం :

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణ గాధ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. మరొక కథనం ఏమిటంటే.. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో.. రుషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు.. తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ విశేషాలు :

* ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

* ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం.

* ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Maha shivratri why devotees fast and halt through the night

  మహాశివరాత్రి పర్వదినాన.. ఉపవాసదీక్ష.. జాగరణ చేయడం ఎందుకు.?

  Feb 13 | సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు. శివుడి అజ్ఞ లేనిదే చీమైనా కుట్టునా.. అన్న వ్యాఖ్యంలోని అర్థరార్థం కూడా అదే. భక్తుల పాలిట పెన్నిధి, శంకరా, కరుణించరా అని భక్తిపూర్వకంగా పిలిచిన భక్తులను... Read more

 • What is the secret behind namaskar

  నమస్కారం ఎందుకని భారతీయ సంస్కార ప్రత్యేకం.?

  Jan 22 | మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్ని పేర్కొన్నాయి. పెద్దలు, గురువులు, ఇలా ఎవరు తారాసపడినా వారికి నమస్కారం పెట్టడం మన సంప్రదాయంగా మారింది. అసలు నమస్కారమంటే ఏమిటి.. ఎందుకు పెడుతున్నామన్న విషయాలు... Read more

 • Why devotees enter through northern door on mukkoti ekadasi in lord vishnu temples

  ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు.?

  Dec 28 | సరిగ్గా శీతాకాలం.. అందులోనూ వెన్నులో వణుకు పుట్టించేంత చలి.. ఈ సమయంలో ఉదయం సూర్యుడు వచ్చినా.. దుప్పటిని వదలాలంటే ఎవరూ ఇష్టపడరు. కానీ పండు ముదుసలి నుంచి చిన్నారుల వరకు అందరూ వైకుంఠ ఏకాదశి... Read more

 • Nehar nala an olden engineering expertise proof

  పురాతన ఇంజినీరింగ్‌ అద్భుతానికి సాక్ష్యం ‘నెహర్‌ నాలా’

  Oct 28 | గోల్కొండ కోట పరిధిలోని రాజప్రసాదం, ఉన్నతాధికారులు, సహాయక సిబ్బంది, కోటలో నివాసం ఉండేవారికి స్థానికంగా ఉన్న బావుల్లోని నీరు సరిపోయేది కాదు. కుత్‌బ్‌షాహీ పాలకుల ఆదేశంతో అప్పటి ఇంజినీర్లు చుట్టుపక్కల నీటి వనరుల్ని అన్వేషించారు.... Read more

 • Narakasura was killed at nadakuduri by satyabhama

  నరకాసుర వధ జరిగిన ప్రాంతమేధో తెలుసా..?

  Oct 18 | దీపావళి పండుగ పర్వధినాన్ని యావత్ హైందవజాతి యావత్తూ అలమరికలు లేకుండా ఐక్యంగా జరుపుకుంటారు. అసలు దీపావళి అంటే ఏమిటీ..? దీపావలి అంటే దీపాల వరుస. ఎందుకిలా వరుసగా దీపాలు పెడుతారు. ఇందుకు అనేక కథలు... Read more

Today on Telugu Wishesh