The hampi history which is the historical region in india which shows indian old architecture

hampi news, hampi history, hampi wikipedia, hampi biography, hampi story, hampi historical story, the historical story of hampi, hampi buildings, hampi tourism, vijayanagaram, karnataka news

the hampi history which is the historical region in india which shows indian old Architecture

ప్రాచీన భారతదేశ వాస్తుకళను వెదజల్లే ‘హంపి’

Posted: 11/18/2014 04:10 PM IST
The hampi history which is the historical region in india which shows indian old architecture

ప్రాచీన భారతదేశ వాస్తుకళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం హంపీలో వెదజల్లుతూ వుంటాయి. 14వ శతాబ్దంలో శిథిలమైన ఇక్కడ.. దేశ సంస్కృతీ-సంప్రదాయాలకు సంబంధించిన వాస్తుకళలు వున్నాయి. కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్థూపాలు, గుర్రపుశాలలు, స్నానఘట్టాలు, ఏకరాతి శిల్పాలు లాంటివన్నీ హంపీలోని పెద్ద పరిమాణంలో వున్న బండరాళ్ల మధ్య చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి పటిష్టమైన రూపాన్ని, చారిత్రక భావాన్ని సొంతం చేస్తున్నాయి. అందుకే హంపి శిథిలాలు - యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్థిల్లుతున్నాయి. 13-15 శతాబ్ధముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్యంలో భాగమైన హింపి... ఇప్పుడు చారిత్రాత్మక కట్టడంగా పరిగణించబడుతోంది. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు.

హంపి విశేషాలు :

బళ్లారి జిల్లాలో వున్న ఈ హంపి.. బళ్లారి నుంచి 74 కి.మీ.దూరంలో వుంటుంది. హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు(హరిహర రాయలు),బుక్క రాయలు స్థాపించారు. మొదటి హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు మొదటి బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన ఆనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరు తో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు.

హంపీలో ప్రాచీనకాలానికి చెందిన ఎన్నో శిథిలాలు, దేవాలయాలు, ఆనాటికాలపు రాజులకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కనువిందు చేస్తూనే వుంటాయి. ఇక్కడ.. విరూపాక్ష దేవాలయం, హేమకూట పర్వతం, శ్రీ కృష్ణ దేవాలయం, ఉగ్రనరసింహ మూర్తి, సుగ్రీవుడి గుహ, కోదండరామ దేవాలయం, విఠలేశ్వర దేవాలయ సముదాయం, ఏక శిలా రథం, రాజ తులాభారం, కోటగోడ, హజారా రామాలయం, భూగర్భం లో ఉన్న విరూపాక్షుని దేవాలయం, కమల భవనం, పుష్కరిణి, గజ శాల వంటివి ఎంతో వైభవంగా కనువిందు చేస్తూ.. ఇప్పటికీ పర్యాటకుల్ని ఆకర్షితుల్ని చేస్తూనే వుంటాయి. ఇటువంటి కట్టడాలు వుండటం వల్లే హంపీకి చారిత్రాత్మక ప్రాంతంగా పేరు వచ్చింది.

విజయనగర సామ్రాజ్య వాస్తుకళను కళ్లముందుంచే ఈ శిథిలాలు... చాళుక్య, హోయసల, పాండ్య చోళ సామ్రాజ్యాల రూపంలో గత శతాబ్దాల్లో విలసిల్లిన రీతులకు, జాతీయాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 14-16 శతాబ్దాల మధ్య ఇక్కడ పర్యటించిన యాత్రికులు ఈ ప్రదేశం గురించి ఎంతో గొప్పగా ప్రస్తుతించారు కూడా! అయితే, క్రీ.శ 1565లో దక్కను ప్రాంతాన్ని జయించిన ముస్లిం రాజుల ద్వారా ఈ ప్రాంతం కొల్లగొట్టబడింది. ఆ దెబ్బతో హంపీలో వున్న దేవాలయాలతోపాటు అపురూప నిర్మాణాలన్నీ శిథిలాల రూపంలో పెద్ద బండరాళ్ల కింద నిక్షిప్తమై పోయాయి.

ఈ సామ్రాజ్యం పతనావస్థకు చేరడానికి ముందు.. అనేక సంవత్సరాలపాటు ఇక్కడ వర్థిల్లిన శిల్పకళ, వాస్తుకళ, చిత్రకళలకు ఈ ప్రాంతం వారసత్వంగా వుండేది. అలంకృత స్థంభాలతో నిర్మితమైన కళ్యాణమండపం (వివాహ వేదిక), వసంతమండపం (స్థంభాలతో కూడిన బహిరంగ వేదికలు), రాజగోపురం(టవర్) లాంటి నిర్మాణాలు ఆనాటి వైభవానికి ప్రత్యక్ష ముద్రలుగా నిలుస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hampi  vijayanagaram  hindu temples  karnataka news  telugu news  

Other Articles