Mm keerawani birthday special

MM Keerawani birthday special, mm keeravani special news, mm keeravani birthday special, mm keeravani latest news, mm keeravani movie list, mm keeravani photos, mm keeravani birthday function, mm keeravani birthday news, birthday wishesh to mm keeravani, mm keeravani biography in telugu, mm keeravani history in telugu, mm keeravani wikipedia in telugu, mm keeravani life story in telugu

MM Keerawani birthday special

స్వరాల దర్శకధీరుడు కీరవాణి జన్మదిన శుభాకాంక్షలు

Posted: 07/04/2014 11:32 AM IST
Mm keerawani birthday special

(Image source from: MM Keerawani birthday special)

చాలావరకు సినిమాల విజయాల వెనుక కేవలం నటీనటుల పాత్ర మాత్రమే ముఖ్యం కాదు..! ఏదైనా ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు అందులో వున్న పాత్రలతోపాటు... సహాయకులు, సంగీత దర్శకులు, దర్శకుడు, నిర్మాతలు, అసిస్టెంట్ డైరెక్టర్లు... ఇలా చాలామందే వుంటారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రముఖపాత్ర వుంటుంది. ఏవిధంగా అయితే దర్శకుడు సినిమాను మంచిగా ప్రదర్శించడానికి కష్టపడతాడో... అలాగే ఆ సినిమాకు ఇతర సహాయకులు కూడా అంతగానే తమవంతు సహాయాన్ని అందిస్తారు. అటువంటి సహాయకులనుంచి కీలకపాత్రను పోషించేవారిలో సంగీత దర్శకుడు కూడా ఒకడు!

ప్రపంచంలో వున్న అన్ని సినీరంగాల్లోనూ సంగీత దర్శకుడికి ఒక ప్రత్యేక స్థానమంటూ వుంటుంది. దాదాపుగా వారే సినిమాకు ప్రాణం పోసినంత పాత్రను పోషిస్తారు. వారి లేనిదే అస్సలు సినిమాలో మజాయే వుండదు. అటువంటి సంగీత దర్శకులలో కొందరు తమతమ చిత్రపరిశ్రమల్లో తమదైన పేరును ముద్రించుకున్నారు. అందులో భాగంగానే మన తెలుగు సినీ పరిశ్రమకు సంగీత దర్శకునిగా పరిచయమైన  ఎం.ఎం.కీరవాణి తనదైన ఒక ప్రత్యేక ఇమేజీని సంపాదించుకున్నారు. నేటి యువతర డైరెక్టర్లకు ధీటుగానే మెలోడీస్ సాంగ్స్ అందిస్తూ.. ప్రేక్షక జనాలను అలరిస్తున్నారు.

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు అయిన కోడూరు మరకతమణి కీరవాణి... 1961 జూలై 4వ తేదీన జన్మించారు. ఈయన భార్య పేరు శ్రీవల్లి. ఈయనకు ఇద్దరు కుమారులు. కేవలం మన తెలుగు చిత్రసీమలోనే కాకుండా... తమిళం, హిందీ భాషా చిత్రపరిశ్రమల్లో కూడా ఈయన తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తెలుగుచిత్రరంగంలో ఎం.ఎం.కీరవాణిగానూ, తమిళంలో మరకతమణిగానూ, హిందీలో ఎం.ఎం.క్రీమ్ గా ఈయన ప్రసిద్ధి చెందాడు.

సినీరంగంలో ప్రవేశించడానికి ముందు.. కీరవాణి తెలుగులో ప్రసిద్ధ సంగీత దర్శకులుగా పిలువబడే రాజమణి, చక్రవర్తి వంటివారి దగ్గర సహాయకునిగా పనిచేసేవారు. ఆ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన ‘‘మనసు - మమత’’ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆనాటి నుంచి ప్రారంభమయిన ఈయన సంగీత ప్రస్థానం... ఆయనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. తెలుగు, తమిళ, హింధీ భాషలలో దాదాపు నూరుకు పైగా చిత్రాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు.

కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి చాలా వున్నాయి. అందులో ముఖ్యంగా 1997లో ఈయన సంగీత దర్శకత్వం వహించిన ‘‘అన్నమయ్య’’ చిత్రానికిగానూ జాతీయస్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం లభించింది. టాలీవుడ్ లో అగ్రదర్శకునిగా పేరుపొందిన ఎస్ఎస్ రాజమౌళి సినిమాలన్నింటికీ ఆయన తన సంగీతాన్ని స్వరపరిచారు. అలాగే నాగార్జున నటించిన చాలా చిత్రాలకు ఈయనే సంగీత దర్శకునిగా పనిచేశారు. ఈయన కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 15 చిత్రాలకూ సంగీతాన్ని అందించాడు.

కీరవాణి నేటి యువజనానికి అనుగుణంగా ట్యూన్స్ అందిస్తూ... యువ సంగీత దర్శకులుకు సవాలుగా సంగీతాన్ని స్వరపరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాగే ఈయన తన ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మా ‘‘తెలుగువిశేష్’’ తరఫు నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles