Mikkilyneni radhakrishna murthy biography

mikkilyneni radhakrishna murthy biography in telugu, mikkilineni radhakrishna murthy life history in telugu, mikkilineni radhakrishna murthy story in telugu, mikkilineni radhakrishna murthy movies list, mikkilineni radhakrishna murthy wikipedia in telugu, mikkilineni radhakrishna murthy life story in telugu, mikkilineni radhakrishna murthy daughter, mikkilineni radhakrishna murthy, mikkilineni radhakrishna murthy family members

mikkilyneni radhakrishna murthy biography in telugu

జానపద కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

Posted: 07/11/2014 06:37 PM IST
Mikkilyneni radhakrishna murthy biography

(Image source from: mikkilyneni radhakrishna murthy biography in telugu)

పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి, అందరి మన్ననలను పొందగలిగిన ప్రముఖ తెలుగురంగస్థల, సినిమా నటుడు అయిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి... ఒక స్వాతంత్ర్య సమరయోధుడు కూడా! జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్న ఈయన... 5సార్ల వరకు జైలు శిక్షను కూడా అనుభవించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అందరూ పండుగ చేసుకుంటుంటే... ఇక్కడ నిజా పాలనలో మొగ్గిపోతున్న పేదప్రజల కోసం ఈయన వారితో వ్యతిరేక పోరాటం కూడా చేశాడు. ఈయన అసలు పేరు రాధాకృష్ణమూర్తి మాత్రమే! కానీ సినీరంగంలో ప్రవేశించిన అనంతరం ఈయన తన కుటుంబం పేరు ‘‘మిక్కిలినేని’’గా మార్చుకున్నారు. దాంతో ఆయన ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు.

తెలుగు సినిమాల్లో దాదాపు 400 సినిమాల్లో నటించిన ఈయన... పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి, అందరినీ మెప్పించారు. ఈయన ఎటువంటి ప్రత్యేక శిక్షణలు లేకుండా కేవలం జానపద కళారూపాలతో ప్రభావితులై... కపిలవాయి రామనాథశాస్త్రి దగ్గర శిష్యునిగా చేరారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఈయన.. తరువాత తెలుగు సినిమాల్లో తన సత్తాను చాటుకున్నారు. అప్పట్లో ఈయన ఆంధ్రప్రభలో 400 మంది నటీనటుల జీవితాల గురించి ‘‘నటరత్నాలు’’ అనే శీర్షికగా రాశారు. ‘‘మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణించినా... ప్రస్తుతం జీవించి వున్న తెలుగు సినీకారుల్లో ఆయనే పెద్ద’’ అని అక్కినేని నాగేశ్వరరావు ఈయన గురించి అభివర్ణించారు.

జీవిత చరిత్ర :

ఈయన గుంటూరు జిల్లాలోని లింగాయపాలెం గ్రామంలో జన్మించారు. ఈయన భార్య పేరు సీతారత్నం. ఆమె కూడా పలు నాటకాలలో పాత్రలు ధరించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అయినవాళ్లందరూ ఈయనను నష్టజాతకుడని అవమానించడంతో ఆయన కృష్ణా జిల్లా కోలవెన్నులో వుండే తన అమ్మమ్మగారి బాల్యాన్ని గడిపారు. ఆ తరువాత కపిలవాయి రామనాథశాస్త్రి దగ్గర శిష్యునిగా చేరిన అనంతరం.. తన ఇంటి పేరును ‘‘మిక్కిలినేని’’గా మార్చుకున్నారు. 1949 లో కేఎస్ ప్రకాశ్ రావు దీక్ష సినిమాతో మొదలైన ఈయన సినీ ప్రస్థానం... బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ దాదాపు 400 సినిమాలకు పైగా తెలుగు చిత్రాల్లో ఈయన నటించారు.

బ్రిటీషియన్లు భారతదేశాన్ని అష్టకష్టాలు పెడుతున్న సమయంలోనూ ఈయన వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించాడు. ఎన్నో ఉద్యమాలను నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సహాయపడ్డాడు. అన్యాయం జరుగుతున్న చోట న్యాయపోరాటం చేయాలని గళం విప్పిన ఆయన... ఐదుసార్లు జైలుశిక్షను కూడా అనుభవించాడు. అయినా ఆయన ఓటమిని అంగీకరించకుండా.. దేశానికి ఎలాగైనా స్వాతంత్ర్యం కల్పించాలనే ఆశతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనేవారు.

నాటకరంగంలో మంచి నటుడిగా పేరు సంపాదించిన ఈయన... ‘‘ఆంధ్రుల నటరత్నాలు’’, ఇంకా తదితర రచనలను కూడా రచించాడు. ప్రజానాట్య మండలికి వ్యవస్థాప సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ‘‘తెలుగు జానపద కళారూపాలు, మన పగటి వేషాలు, ఆంధ్రుల నృత్యకళావికారం’’ వంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన రచయిత. ప్రస్తుతం కళారంగాల్లో జీవించి వున్న వారిని జీవితాలను ఈయనతో పోల్చడం కాదు కదా... అస్సలు ఊహించుకోలేము కూడా! అంతటి గొప్ప వ్యక్తి ఈయన. ఎనభై ఏళ్లనాడు కూడా తన భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజాకళాకారుడయిన ఈయన... ఎంతటి మేధావంతుడో అర్థం చేసుకోవచ్చు.

నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే! వీధినాటకాలు-జముకుల కథలు-బుర్రకథలు ప్రదర్శించిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితులను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు. మిక్కిలినేని రచన, విశాలాంధ్ర ప్రచురణ ‘ప్రజల్లో విప్లవజ్వాలలు రేకెత్తించిన అలనాటి ప్రజానాట్యమండలి’ ఈ తరం చదవదగ్గది.

సినీ జీవితంలోకి ప్రవేశించడానికి ముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశారు. ఈయన సినిమారంగంలో అందించిన సేవలకు, పోషించిన పాత్రలకు మంచి పేరు లభించడంతోపాటు... 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. తెలుగువారు ఈయనకు కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించారు. సినీరంగంలో బహుముఖంగా పెరిగిన ఈయన.. ఫిబ్రవరి 22, 2011లో మంగళవారంనాడు తన 95వ ఏట విజయవాడలో మరణించారు. మూత్ర సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడ ఆసుపత్రిలో కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles