Farmers lost crop insurance due to crop loan delay

Farmers, Crop insurance, crop loan, Shabbir Ali, Congress party MLC, KCR

farmers lost crop insurance due to crop loan delay says shabbir ali

రుణమాఫీ జాప్యంతో పంటభీమా కోల్పోయిన రైతులు

Posted: 09/30/2014 03:40 PM IST
Farmers lost crop insurance due to crop loan delay

రుణమాఫీ అమలు జాప్యం కావడంతో రైతులు పంట బీమాను కోల్పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ కింద చెల్లించాల్సిన నగదు జమ కాలేదని ఆయన ఆరోపించారు. ఓ వేళ ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆ నిధులు విడుదల చేసినా.. వాటిని ప్రాసెస్ చేయడానికి 10 రోజులు పడుతుందని, దీంతో రైతులు వారికి లభించే పంట భీమాను కోల్పోయినట్టేనన్నారు.

తెలంగాణలో రైతాంగాన్ని ఓ వైపు వర్షాభావ పరిస్థితులు మరో వైపు విద్యుత్ కోతలు తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత జాప్యం చేయడం వల్ల రైతులు పంట నష్టపరిహారాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఈ సమస్యపై బ్యాంకర్లతోనూ, కేంద్రంతోనూ మాట్లాడి రైతులకు లబ్ది చేకూర్చాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. రైతాంగాన్నితీవ్రంగా కుదిపేస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ అలి ప్రభుత్వానికి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmers  Crop insurance  crop loan  Shabbir Ali  Congress party MLC  KCR  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more