Sarkozy in to news again

sarkozy, france, president, news, contest, presidential elections, facebook, once again

sarkozy in to news again, says he want to contest presidential elections once again

మళ్లీ వార్తల్లోని వ్యక్తిగా.. సరసాల సర్కోజీ

Posted: 09/22/2014 09:29 AM IST
Sarkozy in to news again


ప్లే బోయ్గా ప్రసిద్ధి చెందిన ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ.. మళ్లీ వార్తల్లోకి వచ్చారు. అంతర్జాతీయ మోడల్ కార్లా బ్రూనీతో సరసాలు సాగించిన సర్కోజీ.. మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆ తర్వాత కార్లా బ్రూనీతో పెళ్లి లాంటి విషయాలతో మీడియాలో నిత్యం నానుతూ వచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నమైన అంశంతోనే వార్తల్లోని వ్యక్తిగా మారాడు. అదేంటంటే ఆయన మరోసారి రాజకీయాల్లోకి రావలనుకుంటున్నారు. ఫ్రాన్సుకు మరోసారి అధ్యక్షుడిగా సేవలు అందింద్దామని ఆశపడుతున్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అభిమానులకు ప్రకటించారు. సర్కోజీ ఇప్పుడు మరోసారి సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నారు. యూనియన్ ఫర్ ఎ పాపులర్ మూవ్మెంట్ (యూఎంపీ) తరఫున ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్నారు.

ఫ్రాన్సు అధ్యక్షుడిగా వున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ముద్ర పడిన సర్కోజీపై ఇప్పటికీ పలు కేసులు వున్నాయి. వాటన్నింటినీ అధిగమించి మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడగలనని సర్కోజీ ఆశిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు హోలండ్కు ఆ దేశ ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చేలా మాత్రం లేరు. కేవలం 13 శాతం మంది మాత్రమే హోలండ్ మళ్లీ పోటీ పడాలని అనుకుంటున్నారు. ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికలు 2017లో జరగనున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarkozy  france  president  news  contest  presidential elections  face book  once again  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more