KTR, Vijaysai post same photos on same Platform ఈ ఫోటోలోని వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారో.. తెలుసా.?

Vaccination promotion ktr vijaysai post same photos on same platform

corona vaccination, Telangana IT Minister, KT RamaRao, Visakhapatnam MP, Vijaysai Reddy, social media platform, Twitter, Healthcare workers, Vaccination Promotion, vaccination, Telangana, Andhra Pradesh, Politics

Telangana IT Minister KT RamaRao and Visakhapatnam MP Vijaysai Reddy posted photos on social media platform and acknowledged the commitment of their Healthcare workers who went into the feilds and vaccinated the farmers. But the twist here is they both posted the same photo.

వీళ్లు ఏ రాష్ట్రవాసులో కేటీఆర్, సాయిరెడ్డి సార్లకే తెలుసు.?

Posted: 09/24/2021 06:59 PM IST
Vaccination promotion ktr vijaysai post same photos on same platform

తెలంగాణ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడిగా కన్నా తండ్రిని మించిన తనయుడిగా తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తన మంత్రిత్వశాఖ వ్యవహరాలతో పాటు పార్టీ వ్యవహారాలలో కూడా తన మార్కును వేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టినా.. పూర్తి స్థాయిలో పార్టీకి తన సేవలుఅందిస్తున్నారు. ఈ తరుణంలో గత ఏడాది క్రితం కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా వార్తలు వచ్చాయి.

ఉద్యమ నేపథ్యంలో పార్టీలో చేరిన కేటీఆర్.. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కూడా తన సేవలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. ప్రతీ సమస్యపై తనదైన శైలిలో స్పందిస్తూ వెనువెంటనే ప్రతిస్పందిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇటీవల సైదాబాద్ లోని సింగరేణి కాలనీలోని అరేళ్ల బాలిక అత్యాచారం, హత్య విషయంలో మాత్రం కాసింత తొందరపడ్డారు. ఈ హత్యకేసులో నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆ తరువాత హత్యాచార కేసులో నిందితుడ్ని ఆచూకీ చెప్పినవారికి భారి బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు.

దీంతో తన తప్పిదాన్ని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అదే ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ పై తనకు తన సిబ్బంది నుంచి తప్పుడు సమాచారం అందిందని, దాంతోనే తాను నిందితుడు పట్టుబడ్డాడని భావించానని చెప్పుకోచ్చారు. జరిగిన పోరబాటుని అంగీకరించడం కూడా గొప్పదనమే కదా. ఇదంతా జరిగిపోయిన స్టోరి.. తాజా మ్యాటర్ ఏంటంటే.. మరోసారి కూడా అలాంటి తప్పిందమే జరిగిందా.? లేక కావాలనే ఇలాంటి పోరబాటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ హ్యాండర్ ద్వారా జరిగిందా.? అన్నది అర్థంకాని ప్రశ్న. ఈ నెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు.

ఈ నెల 22న సరిగ్గా ఉదయం 11.05 నిమిషాలకు చేసిన ఈ పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైద్యారోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ఎంతటి అకుంటిత భావంతో విధులు నిర్వహిస్తున్నారో అంటూ ఆ ఫోటోలు తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో విజయనగరం జిల్లాలో కొందరు వైద్యఆరోగ్య సిబ్బంది ఓ పెద్దవయస్సులో ఉన్న రైతుకు కరోనా టీకాఇస్తున్నారు. అదే పోస్టులో మరో ఫోటోలో ప్రకాశం జిల్లాలోనూ పోలాల్లో పనిచేస్తున్న మహిళలకు అరోగ్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాలో మాన్యంలో ఓ మహిళా ఏఎన్ఎం ఎంతో ధైర్యంతో నడుములోతు నీరు ప్రవహిస్తున్న వాగును దాటి పోర్లుబంద గ్రామానికి వెళ్లి టీకాలను వేసిందని పేర్కోన్నారు.

అయితే వీటిలోని విజయనగరం, ప్రకాశం జిల్లాలోని ఫోటోలను ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఫోటోలుగా పేర్కోంటూ.. కేటీఆర్ ఈనెల 24న ఉదయం 9.01 నిమిషాలకు వాటినే పోస్టు చేశారు. అయితే విజయసాయి తన వైద్యఅరోగ్యసిబ్బంది అంకితభావాన్ని చాటుతూ తెలుగులో పోస్టు పెట్టగా, కేటీఆర్ మాత్రం తమ అరోగ్య కార్యకర్తలు అకుంటిత భావాన్ని తెలుపుతూ ఆంగ్లంలో పోస్టు పెట్టారు. దీంతో టీకా తీసుకుంటున్న వ్యక్తులు వారే.. అరోగ్య సిబ్బంది వారే.. ఫోటోలు అవే కావడంతో ఇంతకీ ఈ వైద్యఆరోగ్య సిబ్బంది ఏ రాష్ట్రవాసులని నెటిజనులకు ప్రశ్నిస్తున్నారు.


తెలుగురాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఒక్కటేనని చాటడానికి ఈ కరోనా వాక్సీన్ టీకాల ఫోటోలనే కొందరు ఉదహరిస్తున్నారు. మరికోందరు మాత్రం రాష్ట్రాలు విడిపోయిన విషయాన్ని ఈ నేతలు మర్చిపోయారా.? లేక ప్రజలను మధ్యపెట్టడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకోందరు మాత్రం ఈ వైద్యారోగ్య సిబ్బంది, టీకాలు తీసుకన్న వ్యక్తులు అసలు తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనా.? అంటూ వ్యంగంగా ప్రశ్నలను సందిస్తున్నారు. ఇక రాష్ట్రాలు విడిపోవాలని, మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా వనరులు మాకే అంటూ ఉద్యమాలు చేసినా.. ఇప్పుడు మాత్రం ఎవరి ఫోటోను ఎవరు పంచుకుంటున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇది కూడా తప్పుడు సమాచారమేనని మంత్రివర్యులు అంగీకరిస్తారేమో వేచి చూడాలిమరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles