ap cs neelam sahni to go on long leave.? లాంగ్ లీవ్‌పై ఏపీ సీఎస్ నీలం సహానీ?

Andhra pradesh cs neelam sahni to go on long leave

Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh High Court, Neelam Sahni, Neelam Sahni on leave, Neelam Sahni latest news, ap cs Neelam Sahni, Neelam Sahni latest news, Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Secratary Neelam Sahni is facing mental tension between AP Government and AP HIgh Court, hence she is in a thought to go on long leave instead facing consequences in the last regime of her career,

లాంగ్ లీవ్ పై వెళ్లనున్నా ఏపీ సీఎస్ నీలం సహాని.?

Posted: 02/03/2020 09:38 PM IST
Andhra pradesh cs neelam sahni to go on long leave

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని దీర్ఘకాలిక సెలవులో వెళ్లనున్నారా.? రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఖరితో కలత చెందిన ఆమె లాంగ్ లీవ్ పెట్టేందుకు సన్నధమయ్యారా.? రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వంపై అసంతృప్తే.. ఏడు నెలలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులను ఆ కుర్చీ నుంచి దూరంగా వుండాలని భావిస్తున్నారా.? ఇప్పుడీవే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇదే ప్రచారం జోరుందుకుంది. అసలేం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆరునెలల్లో పదవీ విరమణ చేయాల్సిన తరుణంలో ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు ఆమె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. కంటిపై కునుకు రావటం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తన సన్నిహితులతో అన్నారని సమాచారం. ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహరంలో క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి… కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ వేటు వేసారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆయనను అమరావతి ధాటి వెళ్ళవద్దని ఆదేశాలు కూడా జారి చేసారు. దీనిని జాస్తి కృష్ణ కిషోర్ క్యాట్ లో సవాల్ చేసారు. దీనిపై స్పందించిన క్యాట్ ఆయనపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తి వేసింది. అంతేకాదు ఈ కేసు విషయంలో ఆయనపై వేటు వేసేందుకు గల కారణాలను సీఎస్ వచ్చి సమాధానం చెప్పాలని క్యాట్ ఆదేశాలు జారి చేసింది. ఈ క్రమంలో ఎప్పుడు ఏ ఉత్తర్వులు జారీ చేయవలసి వస్తుందో నీలం సహాని అందోళనకు గురవుతున్నారని, ఇక అమె మానసికంగా కూడా ఇక్కడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో మానసిక ఒత్తడికి గురవుతున్నారని అమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అటు పాలకుల ఆదేశాలను తిరస్కరించలేని పరిస్థితి.. అదే సమయంలో అటు న్యాయస్థానాల ఆదేశాలను పాటించకుంటే.. కోర్టు దిక్కరణ కేసులను ఎదుర్కోని తన కెరీర్ పై  చేజేతులా రిమార్ వేసుకోవాల్సి వస్తుందని.. అమె డొలాయమానంలో పెడ్డారట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా కొనసాగే కంటే దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లి ప్రశాంతంగా రిటైర్డు అవ్వాలని నీలం సహాని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంథ్ర రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అవగాహన లేకుండా.. తెలుసుకోకుండా.. సీఎస్ గా వచ్చినందుకు నీలం సహానికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

దీనికితోడు సిఎంవోలో పని చేసే తన కన్నా జూనియర్‌ అధికారి ఆదేశాలను పాటించేందుకు ఆమె సుముఖంగా లేరని.. ఎల్వీ సుబ్రహ్మణ్యస్వామి తరహాలోనే ఈమె కూడా ఇష్టపడటం లేదని, దీంతో వారిద్దరి మధ్య కూడా విభేదాలు పొడచూపాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నుండి విశాఖ నగరానికి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు ఒత్డి తీసుకువస్తున్నారని, అయితే న్యాయస్థానాలు మాత్రం అలా చేయడానికి వీల్లేదని అదేశాలు జారీ చేశాయని ఈ క్రమంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్న సీఎస్ నీలం సహాని  దీర్ఘకాలిక సెలవుపై వెళితే… ఈ వ్యవహరాల నుంచి బయట పడవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles