Is this YS Jagan drawback in politics.? ‘చే’జారిపోతున్న నేతలపై చింతలేదు కానీ..

Why ys jagan never overviews on defections of his party leaders

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, Jagan, YS Jagan, jagan comments, pawan kalyan critises jagan, west godavari, bhimavaram, leg injury, pawan kalyan porata yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Since the fondation of floating a own party YSRCP, many leaders have left the party under various reasons, many have defected into ruling party even after elected, why jagan has never overviewed these defections

‘చే’జారిపోతున్న నేతలపై చింతలేదు కానీ..

Posted: 07/26/2018 07:35 PM IST
Why ys jagan never overviews on defections of his party leaders

వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరిట పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎందరో పార్టీని వీడారు. వారందరి అరోపణ వెనుక దాగున్న అసలు విషయం మాత్రం ఒక్కటే. ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు చెప్పలేక మౌనంగా వుండగా, కొందరు మాత్రం బాహాటంగానే చెప్పారు. ఓ వైపు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటీ సీనియర్ నాయకులను జగన్ కానీ, ఆయన పార్టీకానీ బాగానే అదరిస్తున్నా.. రాజకీయ కోవిదుడైన మైసూరారెడ్డి లాంటి సీనియర్లు మాత్రం పార్టీలో మనజాలలేక దూరంగా వున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నెండేళ్ల ప్రస్థానంలో ఇలాంటి అనేక పరిణామాలు జరిగాయి. ఇందుకు గల కారణాలు ఏమైవుంటాయన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం.

పార్టీకి దూరంగా కొనసాగుతూ.. రాజకీయాలపై అనాసక్తిని కనబరుస్తున్న మేధావులు కొందరు పార్టీపై విమర్శలు చేయడం సముచితం కాదంటూ మిన్నకుండిపోయినా.. కొందరు మాత్రం బాహాటంగానే జగన్ పై విమర్శలు సంధించారు. పార్టీని వీడుతున్న క్రమంలో విమర్శలు చేయడం సహజమే కాబట్టి వాటిని జనం కూడా పట్టించుకోలేదు. ఈ క్రమంలో పార్టీకి అత్యంత చేరువుగా వున్న సినీ హీరోలు రాజశేఖర్, రాజా సహా జీవిత ఇంకా చాలా మంది సినీపరిశ్రమకు చెందిన వారెందరో వైసీపీ అవిర్భావ సమయంలో వెంటనడిచారు. కానీ ఇప్పుడు వారంతా ఎమైయ్యారు.. ఎందుకు ఆ పార్టీకి సన్నిహితంగా లేరన్నది కూడా పెద్ద ప్రశ్నే.

ఇలా మరెందరో సినీపరిశ్రమకు చెందిన చాలా మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వున్న అభిమానంతో వైసీపీ పార్టీకి చేరువయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ జగన్ కు మాత్రం దూరమవుతూ వచ్చారు. రాజకీయాలు అన్న తరువాత ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లడం సహజం.. ఎక్కడ అదరణ, అభిమానం వుంటే అక్కడకు వెళ్తుంటారని రాజకీయ విశ్లేషకులు చెప్పే వివరణలు ఎలా వున్నా.. ప్రజలు కూడా ఇది నిత్యం జరిగే తంతేలే అని ఒక నిట్టూర్పు వదిలే.. తమ పనులలో నిమగ్నమవుతుంటారు.

నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైసీపీ పార్టీ అనుకున్నట్లుగానే గత సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యర్థి టీడీపీ పార్టీతో నువ్వా- నేనా అన్నట్లు తలపడింది. పోటాపోటీ మెజారిటీ వస్తుందని అనుకున్న చోట అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రజలు టీడీపీ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అందుకు అప్పట్లో కేంద్రంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ సమ్మెహనం కూడా ప్రభావం చూపగా, మూడవ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా టీడీపీ-బీజేపి కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం కూడా ఓటర్లపై ప్రభావం చూపింది.

హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలను విశ్వసించిన ప్రజలు.. ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సన 88 సీట్ల సాధారణ మెజారిటీకి మించి (103 మంది) సభ్యులను టీడీపీ గెలిపించుకుంది. ఇక వీరికి తోడు నాలుగు స్థానాల్లో బీజేపి అభ్యర్థులను కూడా గెలిపించుకుంది. ఇక వైసీపీ పార్టీ 72 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు బాగానే వున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా తొలి అసెంబ్లీ సమావేశాలలో గడగడలాంచిని జగన్.. ఆ తరువాత టీడీపీ ఎదురుదాడులకు ఖంగుతిన్నారు.

ఈ క్రమంలో తమ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను కూడా కాపాడులకోలేక పోయాడు. వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి వెళ్లిన పలువురు సభ్యులను చేజార్చుకున్నారు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సహా అదినారాయణరెడ్డి, జలీల్ ఖాన్ సహా చట్టసభలకు ఎన్నికైన పలువురు సభ్యులను అధికార పార్టీలో చేరడాన్ని అడ్డుకోలేకపోయారు. అయితే కారణాలు ఏమైనా కావచ్చు..కానీ తాము చేస్తున్న రాజకీయమే తమ వాళ్లు చేస్తున్నారని జగన్ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఈ వలసలు నేర్పుతున్నాయన్నది కాదనలేని వాస్తవం.

తాజాగా రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న దురంధర రాజకీయ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైఎస్ జగన్ పార్టీకి అనుకూలంగా పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. అయితే రాజధాని నిధులపై రాష్ట్రానికి ప్రత్యేకహాదాపై జనసేన వేసిన నిజనిర్థారణ కమిటీలో ఆయన సభ్యుడిగా కొనసాగిన నేపథ్యంలో ఆయనను వైసీపీ పార్టీ కూడా దూరంగా వుంచిందన్న వార్తలు వచ్చాయి. కాగా, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ జరగని విధంగా ఆయన ప్రస్తుతం టీడీపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబుకు అనుకూల పరిస్థితులు లేవని అంటూనే.. ఆయన వ్యూహాలు, చతురత ముందు జగన్ తెలుసుకోలేరని కూడా ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మానవత్వాన్ని, జవాబుదారీతనాన్ని, పారదర్శకత, సామాజిక మార్పును రాజకీయాల్లో మళ్లీ తీసుకురావడానికే తన పార్టీ పెట్టానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన జనసేన అధినేతపై కూడా వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సముచితం. పార్టీ ప్రమాణాలకు కట్టుబడి గెలిచిన సభ్యులు వుండాలని.. అధికారం కోసం కప్పదాట్లు మంచిది కాదని హితబోధ చేసే నాయకుడిని అదరించాలి.. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయాలి.. కానీ అవి సద్విమర్శలై వుండాలి. వ్యక్తిగత వ్యవహరాలపై దూషణలు చేయడం జగన్ వివేకాన్ని తప్పుగా ప్రజల్లోకి వెళ్లే అస్కారముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఒరవడిని తీసుకువచ్చేందుకు.. అధికారమే పరమావధి కాకుండా.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రజలను వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను దూరం చేసేలా.. తమ కోసం ప్రభుత్వం ఉందన్న భరోసాను తీసుకువచ్చేందుకు.. ఒక కులం కోసం కాకుండా, ఒక మతం కోసం కాకుండా.. ఒక ప్రాంతం కోసం కాకుండా.. అవసరం వున్న వారందరికీ తామున్నామన్న భరోసాను కల్పించే క్రమంలో ప్రభుత్వం వుండాలి.. ప్రభుత్వ పథకాలు వుండాలన్న కొత్త అలోచనలతో వస్తున్న పవన్ కల్యాణ్ ను, ఆయన పార్టీ జనసేనను.. వైఎస్ జగన్ స్వాగతించాల్సిపోయి ఎందుకు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికైనా మంచి ఎవరు చెప్పినా మంచే.. చెడు ఎవరు చేసినా చేటే ఎదురవుతుందన్న విషయాన్ని జగన్ గ్రహించాలని రాజకీయ విశ్లేషకుల భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  janasena  YS Jagan  YSR congress  porata yatra  andhra pradesh  politics  

Other Articles