Mob attacks Rahul Gandhi's car with stones in Gujarat వరద బాధితులను పరామర్శిస్తేనే వెన్నులో వణుకా.?

Rahul gandhi s car attacked in gujarat s flood hit banasakantha

rahul gandhi shown black flags, black flags shown to rahul gandhi, stone thrown at rahul gandhis vehicle, rahul gandhi gujarat visit, congress vice-president rahul gandhi banaskantha visit, Rahul Gandhi, Gujarat floods, Banaskantha, convoy attacked, Dhanera, police, bjp, pm modi, amit shah, politics

Is this is how gujarat developed in two decades, they cant even digest opposition leaders touring in the state. Rahul Gandhi’s flood affected area visit, stands as an example

వరద బాధితులను పరామర్శిస్తేనే వెన్నులో వణుకా.?

Posted: 08/04/2017 07:13 PM IST
Rahul gandhi s car attacked in gujarat s flood hit banasakantha

ప్రతిపక్షానికి చెందిన జాతీయ నేత.. రాష్ట్రంలో పర్యటిస్తుంటే.. ఆయనకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడికి చూసస్తుంది. విపక్ష ముక్త్ భారత్ అన్న నినాదంలో ముందుకెళ్లున్న బీజేపి పాలిత రాష్ట్రంలో.. విపక్షానికి చెందిన నేతలు రాకూడదని నిర్ణయించుకున్నారా..? లేక విపక్ష నేతలు వస్తే తమ పప్పులు ఉడకవని తెలుసుకుని ఇలాంటి చర్యలకు పూనుకున్నారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలకు వస్తున్నాయన్న ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేస్తూ.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు గత కొంత కాలంగా బీజేపి ఉవ్విళ్లూరిందన్న విషయం తెలిసిందే.

అయితే వారు అధికారంలో లేని రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఇలాంటి ఘటనలు ఎదురైతే.. ఆ పార్టీ నేతలు ఎవర్నీ నిందిస్తారు..? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా..? మరిక్కడ గుజరాత్ లో గత నాలుగు పర్యాయాలుగా బీజేపి అధికారంలో కొనసాగుతూ.. రాష్ట్రాన్ని దేశానికే అదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని బీరాలు పోతున్నా.. ఎందుకు విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయి. ఏకంగా విపక్ష సభ్యులను తమ అనూయాయువులతో దాడులు చేయించి వారు మరోమారు రాష్ట్రంలోకి రావాలంటేనే జంకేంతలా పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేయించడం సమంజసమేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్ లో ఎదురైన ఈ దారుణానికి కారణం ఎవరై వుంటారన్నది పక్కనబెడితే.. ఇలాంటి ఘటనలు పునారావృతం కావడం మాత్రం సహేతుకం కాదు. ఇలాంటి దాడులను ప్రేరేపించినా.. ప్రోత్సహించినా.. అది దేశ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మారుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే గుజరాత్ లో తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన హార్థిక్ పటేల్ ఉద్యమాన్ని ఉక్కపాదంతో అణచివేసిన ప్రభుత్వం.. రాహుల్ పర్యటనకు మాత్రం తూతూ మంత్రంగా భద్రతను కల్పించడంలో అంతర్యమేమిటన్న ప్రశలు వినిపిస్తున్నాయి.

అనునిత్యం ముష్కరమూకల కాల్పులతో, సరిహద్దు తీవ్రవాదంతో, వేర్పాటు వాదుల హింసతో రావణకాష్టంలా రగులుతున్న జమ్మూ కాశ్మీర్ లో వరదలు పోటెత్తి జనజీవనాన్ని అస్యవ్యస్తం చేసిన నేపథ్యంలో వారికి భరోసాగా నిలిచేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్కడ పర్యటించారు. బాధిత కుటుంబాలకు ఆయన భరోసా కల్పించారు. ప్రభత్వం వుందని.. అందరినీ అదుకుంటుందని, ఎవరూ అదైర్యానికి లోనుకాకూడదని చెప్పారు. అదే తరహాలో గుజరాత్ లో వరదలు సంభవించిన జిల్లాలో రాహుల్ పర్యటించడం ఎందుకు తప్ప అవుతుంది..? ఎలా తప్పు అవుతుంది.?

అయితే అదే ప్రధాని మోడీ.. గతంలో మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన క్రమంలో ఆ రాష్ట్రంలో మాత్రం విపక్షాలకు చెందిన నాయకులు వెళ్లడానికి అనర్హులా..? వారికి అనుమతి లేదా..? లేక ముందస్తు అనుమతిని తీసుకోవాలా..? ఎవరి అనుమతి తీసుకోవాలి..? ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి..? మీ పార్టీ నేతలు అలా అనుమతులు పోందే రాష్ట్ర పర్యటనకుల వెళ్తారా..? వరద బాధితులను కలిసేందుకు విపక్ష నేత వెళ్తేనే ప్రభుత్వం వెన్నలో వణుకు పుట్టి.. ఇలాంటి దాడులకు ప్రేరేపించిందన్న వార్తలు వ్యాపిస్తే.. అది మీకు లాభిస్తుందా.? త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్ లో ఈ దాడుల ప్రభావం ఏమాత్రం చూపదంటారా..? అది విపక్షాలకు లాభం చేకూర్చేవిగా మారవా..? ఇలాంటి అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

గత నాలుగు పర్యాయాలుగా గుజరాత్ కు మీరు నేర్పింది ఇదేనా..?
అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రంలో మీరు పెంచిపోషించింది ఏంటీ..?
విపక్ష నేతలను చూస్తేనే మీరెందుకు అంతంగా జంకుతున్నారు.?
మీ పాలనలో మీరు ప్రజలకు చూపిన బాట ఇదేనా..?
మీ మూడు పర్యాయాల కాలంలో పోలీస్ వ్యవస్థ పటిష్టమైంది.. ఇంతేనా.?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్ అగ్రనేత కేజ్రీవాల్ పై దాడులు వెనుక వున్నది ఎవరు..?
ఢిల్లీలోనూ కేజ్రీవాల్ పై దాడులు చేసింది..? ఎవరు..?
రాహుల్ కాన్వాయ్ పై దాడి కేసులో ఎవర్నైనా అదుపులోకి తీసుకున్నారా..?
కొద్దిలో పెను ప్రమాదం తప్పింది..? అదే రాయి విపక్ష నేతకు తగిలింటే..? ప్రభుత్వం ఏం సమాధానం చెప్పేది.?

దేశ పౌరులకే దేశంలో ఏక్కడికైనా వేళ్లే హక్కును రాజ్యాంగమే ప్రసాదించింది. అలాంటి విపక్షానికి చెందిన నేత రాష్ట్ర పర్యటనలకు వస్తే వారిపై దాడులు చేయించే సంస్కృతిని విడనాడాలి. ప్రజల్లో బలంగా వుండాలంటే.. ప్రజాహిత కార్యక్రమాలు చేసి వారి మనస్సులు గెలవాలి తప్ప.. విపక్ష నేతలపై దాడులను ప్రేరేపించి.. భయపెట్టో, ప్రాణహానికి గురిచేసో కాదు. రాష్ట్రం అంటే దేశంలో భాగమని తెలుసుకుని జాతీయ నేతల పర్యటనలకు విలువనిస్తూ.. కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలి. కానీ అందుకు భిన్నంగా ఇలాంటి సంస్కృతిని పెంచిపోషిస్తే అదే ఒకనాడు శాపంగా పరిణమించే పెను ప్రమాదం పోంచివుందని కూడా తెలుసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Gujarat floods  Banaskantha  convoy attacked  Dhanera  police  bjp  pm modi  amit shah  politics  

Other Articles