ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు | BJP and TDP mind game on rajyadabha seats selection

Bjp and tdp mind game on rajyadabha seats selection

BJP, TDP, Rajyasabha nominations, కాంగ్రెస్, బీజేపీ, రాజ్యసభ నామినేషన్లు, జాతీయ వార్తలు, రాజకీయాలు, తాజా వార్తలు, national news, politics, latest news

The BJP on Sunday released its list of 12 candidates for biennial elections from nine states to the Rajya Sabha, including Union ministers M Venkaiah Naidu, Nirmala Sitharaman, Piyush Goyal, Chaudhary Birender Singh and Mukhtar Abbas Naqvi. BJP Ends Suspense Over Rajya Sabha Nominations With First List.

ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు

Posted: 05/30/2016 01:30 PM IST
Bjp and tdp mind game on rajyadabha seats selection

రాజ్యసభలో ఖాళీ స్థానాలకు సంబంధించి సమీకరణాలు ఏ క్షణంలో ఎలా మారిపోతున్నాయో అర్థం కావటంలేదు. ఎప్పటికప్పుడు సీట్ల కేటాయింపులో మార్పులు చేస్తూ బీజేపీ, తెదేపాలు ఎత్తులు వేస్తున్నాయి. రెండు పార్టీల మొదటి జాబితాలను నిశీతంగా గమనిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. కీలక నేతల సీట్ల కేటాయింపులో వారు అనుసరించే వ్యూహాన్ని బట్టి అంచానాలకు అందకుండా వారు ముందుకు వెళ్తున్నారు. అయితే అవసరమైన దానికంటే ఎక్కువగా ఈ విషయంలో వదంతులు సృష్టిస్తూ ఓ మైండ్ గేమ్ ఆడుతున్నాయి.

అసలు విషయానికొస్తే... ఒకప్పుడు ఆరెస్సెస్ లో కీలక నేతగా రాంమాధవ్ ఏడాదిన్నర క్రితం బీజేపీ నేతగా మారిపోయాడు. అప్పటి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాంమాధవ్ సత్తా చాటుతున్నారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని బీజేపీ దాదాపుగా నిర్ణయించిందని, ఈ క్రమంలో ఆయన్ను ఏపీ కోటా నుంచే పెద్దల సభకు పంపాలని నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనకు మిత్రపక్షం టీడీపీ కూడా ఒకే చెప్పినట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. తెలంగాణలో మొండిచేయి ఇచ్చి ఏపీలో అంతంత మాత్రం ప్రభావం ఉన్న బీజేపీ నేతకు (అఫ్ కోర్స్ ఇక్కడా అదే పరిస్థితి అనుకోండి) సీటు కేటాయించడం దారుణమని తెలంగాణ తమ్ముళ్లంతా గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. కానీ, అదంతా అవాస్తవమని స్వయంగా రాంమాధవ్ చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. సోమవారం ఉదయం ట్విట్టర్ లో ప్రత్యక్షమయిన ఆయన ఏపీ కోటాలో నుంచి తాను రాజ్యసభ బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ తప్పని ట్వీటారు. మరో సీనియర్ టీజీ వెంకటేష్ కూడా సోమవారం ఉదయం చంద్రబాబును కలవటంతో ఆయన పేరు కూడా దాదాపు ఖరారయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజం లేదని పార్టీ ఖండించింది.

దీంతో టీటీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా కనీసం ఏపీ కోటాలో ఉన్న సీట్లలో ఒక్కదానైనా ఇవ్వాలని మోత్కుపల్లి  నేరుగానే విజ్నప్తి చేశారు కూడా. దానికి తోడు మారిన పరిస్థితులు టీడీపీతో పాటు మరోవైపు బీజేపీ నేతల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. టీడీపీ కోటాలో ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక కోటా నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంతా అనుకున్నట్లు కర్ణాటక నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి దింపుతున్నట్లు అల్రెడీ ప్రకటించేసింది. ఆయా సీట్లపై ఇప్పుడు క్లారిటీ రావటంతో పార్టీ పెద్దలను కలిసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అమరావతిలో ఇప్పటికే పాగా వేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో సీనియర్లతో మంతనాలు చేస్తున్నారు. బీజేపీకి సీటు కేటాయించాలా లేక తమ అభ్యర్థులనే నిలబెట్టాలా? తెలంగాణ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలా అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఓవైపు టీ తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తిని తొలగించడంతోపాటు, బీజేపీ మిత్ర భాగస్వామ్యం చెడగొట్టుకోవద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఇప్పటిదాకా మెయింటెన్ చేసిన సస్పెన్స్ కు కాసేపట్లో  తెరపడి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  TDP  Rajyasabha nominations  

Other Articles