చిరు-దాసరిని కలపాల్సింది ఆయనే! | mudragada meets chiranjeevi and dasari for support

Mudragada meets chiranjeevi and dasari for support

mudragada padmanabham, chiranjeevi, dasari, kapu resevations, కాపు రిజర్వేషన్, ముద్రగడ, చిరంజీవి, దాసరి నారాయణరావు, ఏపీ న్యూస్, రాజకీయాలు, political news, latest news

mudragada padmanabham meets chiranjeevi and dasari for kapu reservation support.

చిరు-దాసరిని కలపాల్సింది ఆయనే!

Posted: 05/28/2016 03:38 PM IST
Mudragada meets chiranjeevi and dasari for support

ఓ లెజెండరీ డైరెక్టర్-ఓ లెజెండరీ యాక్టర్‌. వీరిద్దరి మధ్య ఇద్దరికీ ఎక్కడ, ఎప్పుడు చెడిందో కానీ వైరం మాత్రం కొనసాగుతూనే ఉందని అందరికీ తెలుసు. తమ మధ్య అలాంటిదేం లేదు అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ ఏదో ఒక వేదికగా దాసరి మెగా ఫ్యామిలీపై కౌంటర్లు వేయటం, దానికి ఎన్ కౌంటర్లు పడటం మనం చూస్తూనే ఉన్నాం. చిరు రాజకీయాల్లోకి చేరాక ఆ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. బొగ్గు మరకలు అంటిన తర్వాత కాంగ్రెస్ చెయ్యి ఇవ్వటం, చిరు అందులోనే చేరి కీలక వ్యక్తిగా మారటంతో మింగుడు పడని దాసరి పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఆయనను ఇంటికి వెళ్లి కలవటంతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావొచ్చనే అంతా అనుకున్నారు. కానీ, దాసరి మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అదే టైంలో చిరు అండ్ కో పై మాత్రం పరోక్షంగా పంచ్ లు వేస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పుడు వీరిద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం రానే వచ్చింది.

ఏపీలో కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రోడ్డెక్కారు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. గతంలో ఇంట్లోనే ఆమరణ దీక్ష చేసిన సమయంలో దాసరి, చిరు లిద్దరూ ఆయనను కలిసి సంఘీభావం చెప్పాలనుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవటంతో ఎక్కడిక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఆపై ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన ముద్రగడ ప్రభుత్వ నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురుచూశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తిరిగి ఉద్యమించేందుక సిద్ధమౌతున్నారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాదు చేరుకున్న ముద్రగడ పలువురు కీలక నేతలతో వరుసగా భేటీ నిర్వహించారు. ముందుగా చిరంజీవిని, ఆపై దాసరిని కలిసి చాలా సేపు చర్చించారు. వీరిద్దరు ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేదాకా పోరాటం ఆపొద్దని ముద్రగడకు వీరు సూచించారు. ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఈ సందర్భంగా కలిసి రావాల్సిందిగా ముద్రగడ కోరటంతో అందుకు వీరిద్దరు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో పోరాటానికి కలిసివచ్చినప్పటికీ, రాజకీయ వేదిక అవసరమైతే మాత్రం వీరిద్దరు ఏకతాటిపై ఉంటారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  chiranjeevi  dasari  kapu resevations  

Other Articles