union ministers letters and hrd directions not responsible for rohit suicide

Union ministers stress not responsible for rohit vemula suicide says committee report

rohith vemula, hyderabad university, kanhaiya kumar, JNU, JNU row, JNU issue, bandaru dattatreya, smruti irani, hrd officials, hyderabad central university, hcu vc apparao, students suspension, JNU students issue, kanhaiya kumar bail, kanhaiya kumar arrest, kanhaiya kumar sedition

only union ministers bandaru dattatreya and smuri irani nor human resource letters not responsible for rohit vemula, dalit PhD scholar suicide says committee report.

రోహిత్ ఆత్మహత్యలో నిజం నిర్థారణ జరిగిందా..?

Posted: 02/21/2016 09:58 AM IST
Union ministers stress not responsible for rohit vemula suicide says committee report

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు కారణాలు ఏమిటన్న విషయాలాను సంగ్రహించి నివేదిక సమర్పించాల్సిన నిజనిర్థారణ కమిటీ నిజాలనే వెలువరించిందా..? లేక కేంద్రం ఒత్తిడికి తలొగ్గి నివేదికను సమర్పించిందా అన్న అనుమానాలు సర్వత్రా వినబడుతున్నాయి. రోహిత్ తో పాటు ఆయన సహచర విద్యార్థుల సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తాజాగా నివేదిక సమర్పించడమే ఈ అనుమానాలకు తావిస్తుందని అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో వివాదాలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని తేల్చిన కమిటీ.. రోహిత్ సహా సహచర విద్యార్థులు సస్సెన్షన్ కు వర్సిటీ అధికారులే కారణమని తేల్చింది. అయితే అప్పటి వరకు కొనసాగిన వైస్ ఛాన్సిలర్ ఉన్నఫలంగా స్థానచలనం కావడం.. ఆ స్థానంలో వీసీ అప్పారావు ఎలా వచ్చారన్న విషయాన్ని మాత్రం నివేదికలో పోందుపర్చలేదు. అసలు యాకూబ్ మెమెన్ ఉరితీత నేపథ్యం నుంచి జరిగిన ఘటనలు వాటి నేపథ్యంలో విద్యార్థులపై తీసుకన్న చర్యలు గురించి కూడా నివేదకలో వివరించలేదు,

రోహిత్ సహా సహచరుల సస్సెన్షన్, తదనంతర పరిణమాల నేపథ్యంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం, ఆ తరువాత కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఎన్ని లేఖలు వచ్కాయి. ఎప్పుడెప్పుడు వచ్చాయి. వీటిపై చర్యలు ఏమీ తీసుకున్నారు. నిజ నిర్థారణ కమిటీ మాత్రం  వీసీ, రిజిస్ట్రార్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రకాష్‌బాబు, తదితరులతో మాట్లాడిన మీదట... మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని నివేదికలో వెల్లడించింది. అంటే కేంద్రమంత్రుల లేఖలకు, సంబంధిత శాఖ నుంచి వచ్చిన లేఖలను వీసి పక్కనబెట్టారా..? అన్న అనుమానాలు కూడా వినబడుతున్నాయి.

షకీలా శంషు, సూరత్‌సింగ్‌లతో ద్విసభ్య నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదికలో నిజాలు అవిరయ్యాయని విమర్శలు వినబడుతున్నాయి. మొత్తం వ్యవహారానికి వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్న కమిటీ.. కేంద్రమంత్రులను వారి లేఖలను, సంబందిత శాఖ లేఖల వల్ల రోహిత్ కు అతని సహచరులకు నష్టం జరగలేదని తేల్చడానికే ప్రాధాన్యతినిచ్చిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా వివరించి కేంద్ర మంత్రులను తప్పించే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit vemula  rohit suicide  HCU Officials  union ministers  

Other Articles