Is Lagadapati reentry into politics

Is lagadapati reentry into politics

Lagadapati, lagadapati Rajagopal, Lagadapati re entry, Vijayawada

He says he has quit politics but politics don’t seem to leave him alone. Former Congress MP from Vijayawada Lagadapati Rajagopal has ruled out his re-entry into politics. “I am fully focussed on my business now and that’s precisely why I spend most of my time in Delhi. I have been keeping away from politics…so much so that I have even stopped seeing Telugu television news channels

లగడపాటి పొలిటికల్ రీఎంట్రీ...?!

Posted: 02/16/2016 10:20 AM IST
Is lagadapati reentry into politics

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తుందా లేదా అని ఉత్కంఠ సమయంలో ఓ తెలుగు ఎంపీ వేసిన వేశాలు, చేసిన చేష్టలు ఎన్నటికీ మరిచిపోలేనివి. విజయవాడ ఎంపీగా రెండు పర్యాయాలు పనిచేసిన లగడపాటి తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రా భగత్ సింగ్ గా రెచ్చిపోయి రాజకీయ ప్రకంపనలు రేపారు కాబట్టి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేసిన ఆయన.. చివరకు తెలుగు రాష్ట్రాల విభజన జరిగిపోవడంతో.. అయన అన్నట్లుగానే రాజకీయం సన్యాసం తీసుకుని, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
 
కాగా ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తుండడంతో విజయవాడ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నేడు లగడపాటి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా ఆ ఫ్లెక్సీలలో లగడపాటిని ఉద్దేశిస్తూ.. నవ్యాంధ్ర నిర్మాణం, అభివృద్ధి జరగడం కోసం మీరు రాజకీయాల్లోకి మరలా రావాలంటూ విజ్ఞప్తి చేస్తూ లగడపాటికి ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో రీఎంట్రీ చేయడం ఖాయమేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అభిమానులు కోరుతున్నట్లు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lagadapati  lagadapati Rajagopal  Lagadapati re entry  Vijayawada  

Other Articles