Mothkupalli Narsimlu may jump into TRS party

Mothkupalli narsimlu may jump into trs party

TRS, Mothkupalli Narsimlu, TDP, Telangana, Telangana TDP, TTDP, Chnadrababu Naidu

A gossip going viral in Telangana TDP. Telugudesam party senior leader Mothkupalli narsimlu may jump into TRS after ten MLAs jumped into trs

జంపింగ్ జిలానీల్లో మోత్కుపల్లి కూడా..?!

Posted: 02/13/2016 04:08 PM IST
Mothkupalli narsimlu may jump into trs party

తెలుగుదేశం పార్టీ నాయకులు టీఆర్ఎస్ లో చేరడానికి క్యు కట్టారు. ఇప్పటికే దాదాపు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిపోగా మిగిలిన కొద్ది మందిని కాపాడుకునే ప్రయత్నంలో తెలుగుదేశం నపార్టీ నాయకుడు మునిగిపోయారు. అయితే అందరికి షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు లాగా మరో నాయకుడు కూడా చెప్పాపెట్టకుండా పార్టీని వీడిపోతారు అన్న ప్రచారం సాగుతోంది. పార్టీలో ఎంతో సీనియర్ గా పేరున్న ఆ నాయకుడు కూడా పార్టీని వీడితే పార్టీకి మరింత కష్టకాలం తప్పదని సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? మోత్కుపల్లి నర్సిములు గురించి. అవును ఆయన కూడా పార్టీని వీడనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.  

ఎమ్మెల్యేల జంపింగ్ లతో  షాక్ లో ఉన్న టీడీపీకి ఇపుడు పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ఝలక్ ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీటీడీపీ మైనస్ కు చేరిందని.. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణపై దృష్టి సారించలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల విషయంలో కూడా తన ప్రమేయం లేదని ..తనని ఎందుకు పక్కన పెడుతున్నారో కూడా తనకి తెలియడం లేదని ఆయన ఇంతకు ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేమని అడిగితే ఉన్నది ఉన్నట్లు చెబుతానని కూడా అన్నారు. మోత్కుపల్లి ఇలా ఆవేదన చెందడానికి కారణం ఏంటి? నిజంగానే ఆయనకు గౌరవం దక్కట్లేదని ఫీలౌతున్నారా? లేక ఆయన కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TRS  Mothkupalli Narsimlu  TDP  Telangana  Telangana TDP  TTDP  Chnadrababu Naidu  

Other Articles