special status is not like a zinda tilismath says AP speaker kodela shivaprasad rao

Why can t ap government bring special status

kodela on special status, Andhra pradesh special status, special status is not zinda tilasmat, kodela on ap special status at vijayawada, Andhra Pradesh assembly, speaker, kodela shivaprasad rao, special status

special status is not like a zinda tilismath says AP speaker kodela shivaprasad rao

జందాతిలస్మాత్ ఇస్తే చాలు.. కోడెల గారూ..!

Posted: 09/15/2015 07:37 PM IST
Why can t ap government bring special status

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది జిందా తిలిస్మాత్ కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి రాక ముందు.. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రంలో అంధకారమయం అవుతుందని చెప్పిన నేతలు.. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కాదు అంతకన్నా ఎక్కువ అంటూ ప్రచారాలు చేయడంపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఊరూరా ప్రచారం చేసిన టీడీపీ ప్రత్యేక హోదా తీసుకువస్తాం అని ప్రచారం చేయగా, అందుకు జత కలసిని బీజేపి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటే తాము అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా వుందని ఉద్ఘాటించిన తీరును వారు నిలదీస్తున్నారు.

ఎన్నికల ముందు రాష్ట్రం ఎదుర్కోంటున్న రుగ్మతకు జిందాతిలస్మాత్ ఒక్కటే మందు అని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మాట మార్చి అంత కన్నా ఎక్కువగా కేంద్రం ఇస్తానంటే తాము ఎందుకు వద్దంటాం..? అని నిలదీయడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సంవత్సరం క్రితం చెప్పిన మాటలకే ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు.. ఇక ఇప్పుడు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయని అనేవాళ్లు లేకపోలేదు. కేంద్రం ప్రత్యేక హోదా కన్నా మిన్నగా ప్రత్యేక నిధులను ఇస్తుందని చెప్పడం.. అది ఎప్పటికి అచరణలోకి వస్తుందన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై పోరాటాలు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించడంపై కూడా విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేక సహాయం చేసినా ఈ దేశంలో, ప్రపంచంలో అడిగేవారెవ్వరూ లేరని, అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామని.. దీనికి కూడా రాజకీయం కావాలా? అని కోడెల చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేకహోదా సాధన సమితి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రాజకీయాలు కాదు ఈ డిమాండ్ తో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించరా..? అంటూ నిలదీస్తున్నారు. అధికార పార్టీలు ప్రత్యేక హోదాను తీసుకువస్తామని హామిలిచ్చి తప్పిన తరువాత ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తే.. దానికి కూడా రాజకీయం అంటూ రంగు పులుపుతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ సభ్యలు వారు ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చాలునని, అంతకన్నా ఎక్కువ తీసుకోస్తామని ప్రగల్భాలు పలకడం మానాలని కూడా ప్రత్యేక హాదా సాధన సమితి సభ్యులు పలువురు విమర్శిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh assembly  speaker  kodela shivaprasad rao  special status  

Other Articles