Chandrababu | Bhajan | Mandal | Sujana

Chandrababu bhktha bhajana madi with twele members

chandrababu, bhajan, yanamala, ganta, sujana,

chandrababu bhktha bhajana madi with twele members. Ap cm chandrababu bhaktha bhajana mandli which having 12 tdp leaders like sujana, yanamala, ganta etc.

బాబుభక్తుల భజన మండలి.. మొత్తం పన్నెండు మంది

Posted: 04/14/2015 04:46 PM IST
Chandrababu bhktha bhajana madi with twele members

ఏపి రాజధాని గురించి ఏపి మంత్రి మండలి, టిడిపి సభ్యులు విజయవాడలోని రామాలయంలో చర్చకు సిద్దమయ్యారు. అక్కడ అంతకు ముందే రామ కీర్తనలు చేస్తూ, భజనలో మునిగిన భక్తులు కొంత మంది రాజకీయ నాయకులకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. అయితే మన రాజకీయ నాయకులు ముందే మొనార్క్ లు కదా.. మరి భక్తుల మాట మాత్రం ఎందుకు వింటారు. మొత్తానికి వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ రాముడి భక్తులకు టిడిపి వారికి మధ్య వివాదం ముదిరింది. చివరకు భజనలో ఎవరి ప్రతాపం ఏంటో తేల్చుకుందామని సవాల్ విసురు కుంటారు. సవాల్ కు సిద్దమని సుజనా చౌదరి ఏకంగా తొడగొడతాడు.. మా బాబు చంద్రబాబు గ్రేట్ అంటూ మీసం మెలేస్తాడు. దాంతో అటు రాముడి భక్తులకు, ఇటు చంద్రబాబు భక్తులకు మధ్య పోటీ తప్పనిసరి అవుతుంది.

ఇక సుజనా చౌదరి చంద్రబాబు నాయుడి దగ్గరికి వెళ్లి బాబూ.. నా ప్రతాపం ఏంటో చూపించడానికి అవకాశం దొరికింది నన్ను ఆశీర్వదించండి అంటాడు. దాంతో చంద్రబాబు నాయుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చి.. తొడగొట్టడం కాదు సుజనా చౌదరి.. ఖచ్చితంగా పడగొట్టాలి. విజయీభవ అంటూ ఆశీర్వాదం ఇస్తాడు. ఇక దాంతో భజన కీర్తనల పోరాటం మొదలవుతుంది. ఇక హుటాహుటిన పక్కనున్న మంత్రి నారాయణను సార్. దూకుదామా అని అడుగుతారు. దానికి నారాయణ సమాధానం ఇస్తూ. సుజనా నీకు తొందర ఎక్కువయ్యా.. ముందు భజనకు కొంత మంది కావాలి కదా.. వాళ్లను ఏర్పాటు చెయ్ అంటాడు. దాంతో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు ఎక్కువ కీర్తిస్తారు అని అడుగుతారు సుజనా చౌదరి. దానికి టిడిపి నాయకులు సార్.. సార్ నేనే..నేను అంటూ చేతులు లేపారు.. అంతలోనే బాబూ.. మా మంచి బాబు.. చంద్రబాబు అంటూ ఓ కీర్తన వినిపిస్తుంది. అది ఎవరో కాదు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. పార్లమెంట్ లో వేషాలతో అదరగొట్టిన శివప్రసాద్ ఖచ్చితంగా అదరగొడతారని సుజనా టీంలో చేర్చుకున్నాడు.

తర్వాత సీనియర్లకు ప్రాధాన్యతలేదా అని యనమల రామకృష్ణుడు అంటూ సుజనా చౌదరి అతన్ని కూడా భజన మండలిలో చేర్చుకున్నారు. సార్.. పార్టీ మార్చాలన్నా.. పాటలు పాడాలన్నా నేనే ముందు అంటూ గంటా శ్రీనివాస్ ముందుకు వస్తాడు. సరే అని అతన్ని కూడా చేర్చుకుంటారు. అలా అచ్చెన్నాయుడు, పీతల సుజాత, కె.యి క్రిష్ణమూర్తి, నిమ్మల కిష్టప్ప,రావెల, కామినేని శ్రీనివాస్ ఇలా ఓ పది, పన్నెండు మంది టిడిపి మంత్రులు ఇందులో చేరారు. ఇక అటు పక్క మాత్రం రాముడి భక్తులు అంతకంతకు పెరుగుతున్నారు.

అలా గొంతులు సవరించుకోగానే.. చంద్రబాబు నాయుడు రాముడి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక సుజనా చౌదరి రా.. రా.. నారా స్వామి. నా.. స్వామి రారా.. అంటూ ఒ కీర్తన అందుకుంటారు. అలా పాడుతుండగానే టప్పున కరెంట్ పోతుంది. విషయం ఏంటని కనుక్కునేందుకు ఫోన్ చేస్తే.. భీభీత్సమైన వరద వచ్చే అవకాశం ఉంది. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి అని ఓ హెచ్చరిక వినిపిస్తుంది. దాంతో అక్కడి నుండి క్షణాల్లో మాయమైన టిడిపి భజన మండలి కనచూపుమేరలో ఎక్కడా కనిపించలేదు. టిడిపి వారు ఎక్కడ ఎక్కడబ్బా అని వెతుకుతుండగా.. నాన్నా అంటూ మా అమ్మ గొంతు వినిపించింది. టక్కున లేచి చూస్తే అంతా కల.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : chandrababu  bhajan  yanamala  ganta  sujana  

Other Articles