TRS | Car | Telangana | No2

Trs car lost a tyre air from last one year

trs, car, harishrao, kcr. ktr, kavitha, no2, plenary, govt

trs car lost a tyre air from last one year. The trs aprty symbol is car. in the trs party kcr, ktr, kavitha and harishrao like four tyres. But from last one year one tyre lost its air.

టిఆర్ఎస్ కారు టైర్లలో 'హ' టైర్ గాలి పోయిందా.?. తీశారా?

Posted: 04/11/2015 01:35 PM IST
Trs car lost a tyre air from last one year

తెలంగాణలో కారు జోరు గురించి అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన దగ్గర నుండి ఉద్యమాన్ని అంతిమ ఘట్టానికి తీసుకెళ్లడం వరకు కారు హుషారుగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ కారుకు ఒ టైరు కెసిఆర్ అయితే రెండు, మూడు చక్రాల స్థానంలో కొడుకు కేటీఆర్‌, కూతురు కవిత.. ఇక నాలుగో చక్రం స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు మేనల్లుడు హరీశ్‌ రావు. గులాబీ కారుకు ఈ నాలుగు చక్రాలు ఎంత కీలకమో.. టీఆర్‌ఎస్‌లో సాధారణ కార్యకర్తనడిగినా చెప్తారు. అసలు, ఆ నలుగురిలో ఏ ఒక్కరూ లేకుండా టీఆర్‌ఎస్‌ పార్టీని ఊహించడం కష్టం.  అలాంటిది, కొంత కాలంగా ఓ చక్రం.. గతంలో మాదిరి గాలి లేకుండా కనిపిస్తోంది. అయితే.. ఇందులో గాలి సహజంగా తగ్గిందా..? లేక కావాలని తీసేస్తున్నారా..? అన్నదే ఇప్పుడు గులాబీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.

తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, సీఎం కేసీఆర్‌ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటు ప్రభుత్వ నేతగా, అటు పార్టీ అధినేతగా పనులు సమన్వయం చేయడం కొంత కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో నెంబర్‌ టూ ప్రస్తావన మొదలైంది. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ దగ్గర పడుతుండడంతో మరింత బలంగా వినిపిస్తోంది. అయితే.. ఆ నెంబర్‌ 2 ఎవరనేదే అటు ఇంటా, ఇటు బయటా ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్న హరీశ్‌ రావు అన్నింటా తానై ముందు నడిచారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేశారు. అయితే త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీలో హరీశ్‌కు ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవడంతోనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ హోదాలో జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ దాన్ని విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటున్నారు.  ఇందుకోసం ఏడు కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిని సమన్వయ పరిచే బాధ్యత కొడుకు కేటీఆర్‌కు అప్పగించారు. జనాలను మంత్రులు, ప్రజాప్రతినిధులకు అప్పగించిన కేసీఆర్‌.. వీరి సమన్వయ బాధ్యతను కూడా కేటీఆర్‌కే అప్పగించినట్లు చెబుతున్నారు. అదే సమయంలోహరీశ్‌ రావుకు మాత్రం కీలక బాధ్యతలేవీ అప్పగించలేదని సమాచారం.

ఇలా తొలి ప్లీనరీ సమావేశంలొనే హరీష్ రావ్ ను తప్పించారని, కెటిఆర్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలో నెంబర్‌ టూ స్థానానికి పోటీ లేకుండా, ఇప్పటి నుంచే కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని, ఇందులో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ పరిణామాలు పార్టీని ఎటువైపు తీసుకెళ్తాయోననే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి కెసిఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  car  harishrao  kcr. ktr  kavitha  no2  plenary  govt  

Other Articles