chandrababu | ananthavaram | temple

Chandrababu naidu become garndparent after visiting at ananthavaram temple

chanrababu, grandparent, grandson, babu, ananthavaram, thullur, ap, capital

chandrababu naidu become garndparent after visiting at ananthavaram temple. in newly proporsed capital of ap, ananthavaram, srivenkateshwara swamy have the magics some rumour have publishing.

అక్కడికి వెళ్లాడు.. చంద్రబాబు తాతయ్యాడు..!

Posted: 03/25/2015 03:37 PM IST
Chandrababu naidu become garndparent after visiting at ananthavaram temple

ఉగాది రోజు నారా చంద్రబాబు నాయుడికి డబుల్ బొనాంజా దక్కింది. రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో బాబు ఉగాది వేడుకల్లో ఉండగా తీపి కబురు అందింది. చంద్రబాబు నాయుడు ఒకగానొక్క కొడుకుకు పండంటి మగ బిడ్డ పుట్టాడని వార్త బాబు చెవిలో పడింది. దాంతో అక్కడి కార్యక్రమాలు ముగిసిన వెంటనే హైదరాబాద్ కు వచ్చి, తన మనువడిని చూసుకున్నాడు బాబు. కొడుకు లోకేష్ తో కలిసి, కోడలు బ్రాహ్మణి ఆరోగ్య పరిస్థితిపై కూడా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఇది అందరికి తెలిసిన విషయమే అయితే తెలియని విషయం ఇంకోటి ఉంది. అసలు చంద్రబాబు ఎలా తాతయ్యాడో.. ఎలా తీపి కబురు విన్నాడో అన్న విషయం పై ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి.  


తెలుగు వారి తొలి పండగ ఉగాదిని సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోనే రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమక్షంలోనే జరుపుకున్నారు. ఇక్కడి అనంతవరం గ్రామంలో కొండపై వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన హైదరాబాద్‌ వెళ్లిన వెంటనే వారింట వారసుడు జన్మించాడన్న శుభవార్తను విన్నారు. దీంతో ఈ ప్రాంతానికి అనంతవరం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎనలేని ప్రాధాన్యత వచ్చినట్లైంది. అనేక మంది ఇప్పటికే ఈ స్వామి వారిని ఓ సారి దర్శించుకుని వద్దామన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు అక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకే తాతయ్యాడని భలే పుకారు షికారు చేస్తోంది. అయితే చంద్రబాబు కూడా వీటిని మరింత బలం చేకూరేలా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో ఈ వెంకటేశ్వరస్వామి ని ఎంతో నమ్ముతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అనంతవరంలో స్వామి చంద్రబాబు ను కరుణించాడట... ఒకవేళ మీరూ నమ్మితే ఒకసారి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోండి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chanrababu  grandparent  grandson  babu  ananthavaram  thullur  ap  capital  

Other Articles