Ysrcp mla roja trying to get second place in ysrcomgress

నెంబర్ టూ కోసం తపనపడుతున్న రోజా..?

Posted: 03/23/2015 05:00 PM IST
Ysrcp mla roja trying to get second place in ysrcomgress

రోజా..పేరు కాదు బ్రాండ్ అన్నట్లు మారింది. తన మాటలతో ప్రభుత్వపక్షాన కనీసం జవాబు ఇవ్వడానికి కూడా ఎంతో ఆలోచించేలా చేసింది. పిల్లి తన పిల్లలను అన్ని ఇళ్లు తిప్పిర చందాన రోజా కూడా సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి దిగాక అన్ని పార్టీ గడపలు తొక్కారు . చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొన్నాళ్లు పని చేవాక, కొంత కాలానికి వైయస్ జగన్ పార్టీలోకి చేరారు. అప్పటి దాకా చంద్రబాబు భజన చేసిన రోజా, ఒక్కసారిగా చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిళంలా మారారు. సినిమా రంగం నుండి వచ్చిన తర్వాత తొందరగానే రాజకీయాలను వంటపట్టించుకున్నారు.

ఈ మధ్య ఏపి అసెంబ్లీలో రోజా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వంపై దాడి చెయ్యడంలో పార్టీ నాయకుడు జగన్ కన్నా ఓ అడుగు ముందున్నారు రోజా. తెలుగు దేశం పార్టీపై, ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తూ అసెంబ్లీలో కాకపుట్టించారు. జగన్ కూడా రోజాను నిన్ను టార్గెట్ చేస్తు టిడిపి వారు ఉన్నారని హెచ్చరింయడం గమనార్హం. అయితే రోజా ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటని అందరిలో ఓ ప్రశ్న తలెత్తింది.ఇంతకీ దానికి సమాధానం ఏంటా అని అనుకుంటున్నారా.. కొందమంది అనుకోవడం రోజా వైయస్ఆర్ పార్టీలో నెంబర్ టూ స్థానం కోసమే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతోందని అంటున్నారు. మీడియాను తన వైపుకు తిప్పుకోవడం ద్వారా అధినేత దృష్టిలో పడాలని ఎంతో ఆరాటపడుతోందని వారు అంటున్నారు. అయితే నిన్నటి దాకా పార్టీలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఇప్పుడు వెనుక బడటంతో మహిళా నేత కోటాలో ఎలాగైనా వైయస్ఆర్ కాంగ్రెస్ లో నెంబర్ టూగా ఎదగాలని ప్రయత్నిస్తోందని పుకారు షికారు చేస్తోంది. అయితే రోజాను బాగానే వెనకేసుకోస్తున్న జగన్ నిజంగా రోజాకు రెండో స్థానాన్ని కట్టబెడతారా లేదా అన్నది తెలియాలి. అయినా పార్టీలు మారే రోజాకు అంత సీను లేదు అని కూడా కొంత మంది స్వంత పార్టీ నేతలే రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles