Bjp defeat in medak bypoll

bjp, bharatiya janata party, bjp telangana, bjp andhrapradesh, kishan reddy, jagga reddy, tdp, telugu desham party, tdp telangana, tdp andhrapradesh, trs, medak, medak bypoll, elections, results, prabhakar reddy, sunita laxma reddy

bjp candidate jaggareddy defeated in medak mp byelections with trs : political analysts says bjp will never comes into power in telangana

తెలంగాణలో కమలం ఎందుకు పూయటంలేదు.. ?

Posted: 09/16/2014 04:00 PM IST
Bjp defeat in medak bypoll

మెదక్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి. కంచుకోటలో ఎప్పట్లాగానే కారు దూసుకెళ్లింది. పంక్చర్ చేస్తుందనుకున్న కమలం రెక్కలు రాలిపోయాయి. మరోసారి ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టంకట్టారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఉప ఎన్నికల్లో గెలిచింది. అనుకున్నంత స్థాయిలో మెజార్టీ రాకపోయినా.. ఎవరూ ఊహించని విధంగా సునీత లక్ష్మా రెడ్డి రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది కమలం గురించే. తెలంగాణను కావాలని ప్రతిపక్షంలో ఉండగా పట్టుబట్టి బిల్లు పెట్టించి ఆమోదానికి మద్దతు తెలిపింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాలేదు. ఉప ఎన్నికల్లో కేసీఆర్ గాలి పోయి.., తమ పువ్వు సువాసనలు వస్తాయనుకుంటే వికసించటమే కష్టం అయింది. తెలంగాణ కోసం పోరాడిన బీజేపికి ఎందుకిలా అవుతోంది.

తెలంగాణ ఉద్యమం ఎగిసిపడటంతోనే మొదటగా దాన్ని పట్టుకుని పైకి లేచింది కమలదళం మాత్రమే. టీఆర్ఎస్ ఉద్యమాన్ని విస్తరిస్తుంటే.., రాజకీయ పార్టీగా ప్రజలతో కలిసి కమలదండు ఉద్యమించింది. ప్రతి పోరాటంలో బీజేపీ పాల్గొంది. టీఆర్ఎస్ తో సమాంతరంగా ఉద్యమాన్ని రచించింది. జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించింది. కేంద్రం బిల్లు పెట్టే ముందుగానే పలుమార్లు తెలంగాణ ప్రయివేటు బిల్లును పెట్టి తమ నిర్ణయాన్ని చెప్పింది. ఆ తర్వాత చివరి సమయంలో బిల్లు పెట్టినా పెద్ద మనసుతో అంగీకరించి మద్దతు తెలిపింది. ఇంత చేసినా పార్టీ మాత్రం ఇక్కడ గెలవటం కష్టం అవుతోంది. అది సార్వత్రిక ఎన్నికలు అయినా సరే.., ఉప ఎన్నికలు తీసుకున్నా.

విశ్లేషకుల అంచనాను బట్టి తెలంగాణ ప్రజలు బీజేపిని తెలంగాణకు మద్దతిచ్చిన పార్టీగా కాకుండా కేవలం రాజకీయ పార్టీగా చూస్తున్నారు. అందర్లాగానే బీజేపి తెలంగాణకు మద్దతిచ్చింది.., అందరి లాగానే పోరాడింది అంతే. అనే భావన ఉన్నట్లు చెప్తున్నారు. ప్రజల దృష్టిలో తెలంగాణ ఉద్యమం అంటే టీ.ఆర్.ఎస్. ఉద్యమానికి ఊపిరి ఊదిన పార్టీనే వారు గుర్తుపెట్టుకున్నారు. అందువల్లే తాజా మెదక్ ఉప ఎన్నికలో స్థానికుడు, బలగం ఉన్న జగ్గారెడ్డి కనీసం రెండవ అభ్యర్ధిగా కూడా నిలవలేకపోయాడని తెలుస్తోంది. ఇక దక్షిణాదిన కమలం తోటలు తక్కువని అందరికి తెలుసు అందులో పార్టీ వికాసం కూడా పట్టణాలకే ఎక్కువగా పరిమితం అయి ఉంది. గ్రామీణ స్థాయిలో కమిటీలు, పార్టీ కార్యకర్తలు బలంగా లేరు.

ఒకప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టుల హవా కొనసాగితే క్రమంగా వాటి ఓటు బ్యాంకును కాంగ్రెస్, టీడీపీ పంచుకున్నాయి. దీంతో తరుచుగా మారటం ఇష్టం లేని ప్రజలు ఆ పార్టీలకు అంటిపెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మతం అంటే అంతగా ఆసక్తి చూపని ప్రజలు ప్రాంతియత, జాతి అనే భావాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల్లో కులాల కొట్లాటలు చూశాం కానీ.. మత పర గొడవలు ఎప్పుడూ చూడలేదు. అవి పట్టణాలకే పరిమితం అందువల్ల బీజేపి కూడా ఇప్పటివరకున్న పరిస్థితులను బట్టి పట్టణాలకే పరిమితం అయింది. గ్రామాలకు వెళ్లాలంటే అక్కడ పరిస్థితులు మారి ప్రజల ఆలోచన విధానం కూడా మారాలి. అప్పటివరకు పరిస్థితి ఇంతే అని విశ్లేషకులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaggareddy  prabhakar reddy  medak bypoll  latest news  

Other Articles