Muslim voters in varanasi bending towards aap

Muslim voters in Varanasi bending towards AAP, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Muslim voters in Varanasi bending towards AAP

వారణాసిలో ముస్లింల మొగ్గు ఆఆపా వైపు?

Posted: 05/09/2014 12:28 PM IST
Muslim voters in varanasi bending towards aap

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి వారణాసిలో ఎన్నికల ప్రచార సభలకు అనుమతి లభించకపోవటంతో ఆ పార్టీకి మద్దతునిస్తున్న ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తలు కాషాయ రంగు టోపీలతో వారణాసిలో చేసిన ఆందోళన వారి బల ప్రదర్శనలాగానే గోచరించింది.  

దానితో అదంతా చూసిన ముస్లిం వోటర్లు ఆలోచనలో పడ్డట్టుగా కనిపిస్తోంది.  వారణాసిలో ఆందోళనవలన గొడవలేమీ జరగకపోయినా పురివిప్పిన కాషాయం ముస్లిం నాయకులలో అభద్రతా భావాన్ని సృష్టించినట్లుగా అవగతమౌతోంది.  భాజపా అలా పెరగకూడదు కానీ పెరిగిపోతోంది అనే భావన వాళ్ళని కలతపెడుతున్నట్లుగా ఉంది.  

దీని వలన లాభ పడబోతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ.  

మోదీ పట్ల విముఖత, అంతగా మద్దతునిస్తున్న ఆర్ఎస్ఎస్, ఇవన్నీ చూస్తుంటే, ప్రత్యామ్నాయంగా మోదీని ఢీకొంటున్న అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతునివ్వటంతో కనీసం మోదీ బలాన్ని తగ్గించినట్లవుతుందనే ఉద్దేశ్యాన్ని ముస్లిం వోటర్లు వెలిబుచ్చారు.  

వారణాసిలో 15 లక్షల మంది వోటర్లలో మూడున్నర లక్షల మంది ముస్లిం వోటర్లున్నారు.  కాబట్టి ఎవరికి వోటెయ్యాలన్నదానికంటే ఎవరిని ఓడించాలన్నదానిలో వాళ్ళల్లో స్పష్టత ఉంది కాబట్టి, మోదీ శక్తిని తగ్గించాలంటే గట్టిగా నిలబడి పోటీనిస్తున్న కేజ్రీవాల్ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ వోట్లలో అధిక శాతం ఆఆపాకు పడే అవకాశం కనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles