Ysrcp supporters vandalism in chittore district

YSRCP supporters vandalism in Chittore district, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

YSRCP supporters vandalism in Chittore district

మావూరు, మా ఇష్టం, తిరగబడతాం, దాడిచేస్తాం మీకేంటి?

Posted: 05/08/2014 12:27 PM IST
Ysrcp supporters vandalism in chittore district

ఇది మావూరు.  మా ఇష్టం.  మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం. అడ్డొస్తే వూరుకోం.  అనే వైఖరి చిత్తూరు జిల్లాలో వైయస్ ఆర్ కాంగ్రెస్ మద్దతుదార్లలో పోలింగ్ రోజున కనిపించింది.  

ఎదురు వచ్చినవాళ్ళు ప్రత్యర్థులే కావొచ్చు, పోలీసులే కావొచ్చు, ఎన్నికల అధికారులే కావొచ్చు లేదా మీడియా కావొచ్చు కానీ ఎవరైనా దాడికి అర్హులే అన్నట్లుగా వైకాపా మద్దతుదార్లు తెగబడ్డారని బాధితులైన మీడియా ప్రతినిధులు చెప్తున్నారు.  

చంద్రగిరి నియోజకవర్గం నడవలూరులో వికలాంగులు అడిగితే సహాయంగా ఇవిఎమ్ దగ్గరకు తీసుకునివెళ్ళిన ఎన్నికల అధికారిని, వాళ్ళ చేత తెదేపా మీద వోటు వేయించారంటూ దాడిచేసారు.  పోలీసులు అడ్డుపడ్డా ఆగలేదు బూత్ కాప్చరింగ్ కి సిద్ధపడ్డారు.  దానితో వైకాపా రిగ్గింగ్ కి పాల్పడుతోందని తెదేపా ఆరోపించింది.  విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా వారి మీద దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసి, వాళ్ళని అక్కడి నుండి తరిమి కొట్టిన వైకాపా మద్దతుదారులు వాళ్ళని పొలిమేరలు దాటించి గ్రామంలోకి అడుగుపెట్టటానికి వీల్లేదంటూ హెచ్చరించారు.

అయినా మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్వవస్థ, ఎన్నికల వ్యవస్థ బాగా నడుస్తున్నాయనే నమ్ముతున్నాం, చెప్పుకుంటున్నాం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles