Ongole mp likely to join telugu desam

Magunta Srinivasulu Reddy , Ongole MP, Telugu Desam Party,state bifurcation, Seemandhra region, Congress party, Nellore MP, YSRCP, Mekapati

Magunta Srinivasula Reddy, who is the Ongole MP, is being suggested as the likely candidate of the TDP for the Nellore Lok Sabha seat in the coming general elections.

పసుపు రంగు పూసుకుంటున్న మాగుంట ?

Posted: 12/24/2013 11:07 AM IST
Ongole mp likely to join telugu desam

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే ధర్మాన ప్రసాద్ వంటి సీనియర్ నాయకులు వైకాపా పార్టీ వైపు వెళ్ళేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న తాజా గుసగుస.

ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో చేయించిన సర్వేల ఆధారంగా 2014 తరువాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని తేలడంతో ఇప్పటి నుండే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో భాగంగానే ఒక్కొక్కరు జంప్ అవుతున్నారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్న ఈయన... టీడీపీలోకి వెళితే... ఒంగోలులో కాంగ్రెస్ కోట కోట కూలడం ఖాయం అంటున్నారు. అయితే, ఈ దఫా ఈయన తన సొంత జిల్లా నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఇదేగాని జరిగితే నెల్లూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి. సీమాంద్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీల మద్యనే పోటీ ఉండబోతున్న తరుణంలో మాగుంట టీడీపీలో చేరి పోటీచేస్తే అది మేకపాటికి సవాలు విసిరినట్లు అవుతుంది. అసలే సీమాంధ్రలో టీడీపీ, వైకాపాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈయన నెల్లూరు నుండి పోటీ చేస్తే అక్కడ రాజకీయ రణరంగం తప్పదనే వాదని వినిపిస్తుంది విశ్లేషకుల నుండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles