Minister ganta srinivasa rao to join in tdp

Ganta Srinivasa Rao, join in TDP Party, Resign to Congress Party, Ayyanna Patrudu, Ganta Srinivasa Rao, TDP, Chandrababu naidu, Vizag, opposition

Ganta Srinivasa Rao doesn join TDP.

చిరుకు గంటా కొట్టి... బాబుకు జై కొడుతున్నాడు

Posted: 12/25/2013 05:10 PM IST
Minister ganta srinivasa rao to join in tdp

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలోకి ప్లేటు ఫిరాయించుతారో తెలియదు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని అంటున్నారు మంత్రి గంటా శ్రీనివాస రావు. గతంలో టీడీపీ పార్టీలో ఉన్న ఆ తరువాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టలోకి వచ్చి, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవిస్తున్న ‘గంటా ’ ఇప్పుడు తన సొంత గూటికే వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు.

సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తెలుగు దేశం పార్టీలోకి వెళ్ళడమే మంచిదని భావించిన గంటా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్రలోని ఆ పార్టీ నేతలతో విశాఖపట్నంలో అంతర్గత సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవ్, సీఎం రమేష్ లాంటి సీనియర్ నాయకులు హాజరయ్యి గంటా చేరిక పై చర్చించారు.

అయితే గంటాను తెలుగుదేశంలో చేర్చుకోనే విషయంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేర్చుకుంటే తాను ఒప్పుకునేది లేదని కరాకండిగా బాబు ముఖానే అయ్యన్నపాత్రుడు చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ లో పదవి అనుభవిస్తున్న ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం కరెక్టు కాదని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే గంటా పార్టీలోకి వస్తే నష్టమే తప్ప లాభం లేదని చెప్పినట్లు సమాచారం.

కానీ చంద్రబాబు అయ్యన్న పాత్రుడికి సర్థి చెప్పి తనకు ఎంపీ సీటు, తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తానని హామి ఇచ్చి చల్లబర్చాడని, నేడు చంద్రబాబు గంటా కూతురు వివాహానికి కూడా హాజరవుతున్నాడని, పెళ్ళి హడావుడి తరువాత గంటా చేరిక టీడీపీలో లాంఛనమే అనే మాట వినిపిస్తుంది. దీని పై చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles