ఆర్యులకెల్ల మ్రొక్కివిన తాంగుఁడనై రఘనాథభట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్యసౌ
కర్యమెలర్పనొక్క శత కంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధి !
టీకా : ఆర్యులకు +ఎల్లన్ మ్రొక్కి = పెద్దల కందఱకును మ్రొక్కి, వినతాంగుడనై = వంచిన శరీరము గలవాడనై, రఘు-లకు, అంజలెత్తి = దోసిలిమొగ్గు, కవిసత్తములన్ = కవిశ్రేష్ఠులను, వినుతించి, కార్య-నేడు, ఇది = ఈ శతకమును, తాత్పర్యమునన్ = ఇష్టముతో, గ్రహింపుము = గైకొనుము
తాత్పర్యము : పెద్దలందరికీ మొక్కి, శరీరాన్ని వంచి, గురువైన రఘునాథ భట్టుని నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగిడి, కార్యలాభాములకోసం శతకాలు వ్రాసెదను. దీనిని నిష్టముతో గ్రహించు.
(And get your daily news straight to your inbox)
Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more
Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more
Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more
Apr 12 | గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్ సరసులమాడ్కి, సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more
Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more