తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం
బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ!
టీకా : తరణికులేశ = సూర్యవంశపు రాజా! ; నా నుడులన్ = నా మాటలలో ; నీదు - మైన = నీ పేరుతో బాగా రచించబడిన ; వియన్నదీజలంబు = గంగానది నీరు ; మలినాకృతిన్ = మురికితోడను ; తన్మహత్త్వమున్ = దాని గొప్పదనం ; గణింపన్ = లెక్కింప ; తరమే = సాధ్యమా
తాత్పర్యము : నా మాటలలో ఎన్ని తప్పులున్నప్పటికీ.. నీ పేరుతో నేను రాసే కావ్యం పవిత్రమైంది. అదెలా అంటే.. ఎంతో పవిత్రమైన గంగానది నీరు వంకరగా పారినా, మురికితో నిండి వున్నా.. దాని గొప్పదనం ఎక్కడికి వెళ్లదు. అసలు గంగానది గొప్పదనం గురించి లెక్కించడం సాధ్యమవుతుందా?
(And get your daily news straight to your inbox)
Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more
Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more
Apr 12 | గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్ సరసులమాడ్కి, సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more
Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more
Apr 08 | కనకవిశాలచేల భవ కానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివి జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :... Read more