శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరి పాల వినోద విషాద వల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
శ్రీద = సంపద నిచ్చువాడా, సనంద-పాద = సనందనాది మునులచే సేవింపబడిన పాదములు గలవాడా, దిగం-పాద = దిశల చివర వరకు కీర్తిని సంపాదించిన వాడా, సమ-నోద = అన్ని ప్రాణులను రక్షించుటయే వినోదముగ గలవాడా, సమ-నోద = దు:ఖమను తీగల త్రెంపువాడా, ధరా-పాద = రాజకులమను సముద్రమునకు నమృతముతో నొప్పు కిరణములు గలవాడా (చంద్రుడు), నృత్త-నోద = నాట్యము, సంగీతము మొదలగునవి వేడుకగా గలవాడా
తాత్పర్యము : సంపదల నిచ్చువాడవు , మునులచే బూజింపబడిన వాడవు, కీర్తిమంతడవు, అన్ని భూతములను పాలించువాడవు, దు:ఖముల బోగొట్టువాడవు , క్షత్రియకులమను సముద్రమునకు జంద్రుడువు, నృత్యము గానము వేడుకగా గలవాడవు, భద్రాచలరామా!
(And get your daily news straight to your inbox)
Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more
Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more
Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more
Apr 12 | గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్ సరసులమాడ్కి, సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more
Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more