Failure candidates digvijaya singh and rahul gandhi

failure candidates digvijaya singh and rahul gandhi, congress party, digvijay singh, rahul gandhi, delhi polls results, congress leaders, karnataka election, tdp leader harikrishna, unlike leaders, sonia gandhi, telagnana bill, Delhi cm post,

failure candidates digvijaya singh and rahul gandhi

ఒకరు అపజయాల వీరుడు-మరొకరు ఐరన్ లెగ్

Posted: 12/09/2013 06:48 PM IST
Failure candidates digvijaya singh and rahul gandhi

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో .. ఒక విచిత్రమై సెంటిమెంట్ తో బాధపడుతున్నారు. ఒక సీనియర్ నాయకుడు, మరోకరు జూనియర్ నాయకుడు. ఈ ఇద్దరి జాతకం రీత్యం వచ్చే కష్టాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక్షంగా చూస్తున్నారు. ఒకరు అపజయల వీరుడు. మరొకరు ఐరన్ లెగ్. ఈఇద్దరు కలిస్తే మాత్రం అక్కడ మిగిలేది బూడిదే అని ఢిల్లీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా సొంత రాష్ట్రంలో చిత్తుగా ఓడిపోయిన అపజయల వీరుడు దిగ్విజయ్ సింగ్. మరొకరు ఎక్కడ అడుగుపెడితే.. అక్కడ పచ్చగా బతికే మొక్క సైతం నిలువునా ఎండిపోవడమే అని నిరూపించిన రాహుల్ గాంధీ.

 

గతంలో రాహాల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఎన్నికల ఫలితాలు .. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. రాహుల్ గాంధీ ప్రచారం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ దూరంగా ఉండబట్టే.. అక్కడ కాంగ్రెస్ గెలిచిందని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ మళ్లీ గుర్తు చేశారు.

 

రాష్ట్రవిభజనలో కపటనాటకసూత్రధారిగా దిగ్విజయ్‌ వ్యవహరించాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రచారం చేసినా ఏ రాష్ట్రంలో విజయమన్నదెరుగని ఇనుపగజ్జల పాదచారి రాహుల్‌ గాంధీ అన్నారు. విభజనతో మండిన తెలుగువాడి ఆవేశం కాంగ్రెస్‌ను ఎలా దావానంలా చుట్టుముట్టి కాల్చిందో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలుగా విడగొడతామనడం బీజేపీకీ తగునా అని హరికృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రసమైక్యతను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం అన్నారు. తెలుగు జాతి సమైక్యత కోసం పెద్దరికం తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఏ పార్టీ ఎంపీలైనా రాజీనామా లేఖలు తనకు ఇస్తే, వాటిని ఆమోదింపజేయిస్తానన్నారు.

 

అయితే ఢిల్లీ ఎన్నికల విషయన్ని ముందుగానే పసిగట్టిన సోనియా గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు రాహుల్ గాంధీ జాతకంపై ద్రుష్టి పెట్టారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టిన నాటి నుండి .. పార్టీకి అన్ని అపజయాలే అని ఢిల్లీ పెద్దలు అంటున్నారు. దీంతో రాహుల్ గాంధీని రాజకీయలకు దూరంగా పెట్టేందుకు సోనియా గాంధీ రెఢీ అవుతుందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more