Mothers blessings modi muslims pray on his 64th birthday

mothers blessings modi muslims pray on his 64th birthday, Narendra Modi on his 64th birthday, BJP celebrates Narendra Modi 64th birthday, Gujarat Chief Minister Narendra Modi, PM wishes Narendra Modi on his 64th Birthday, Narendra Modi, LK Advani praises Narendra Modi

mothers blessings modi muslims pray on his 64th birthday, Modi takes mother blessings on his 64th birthday

మోడీ కి తల్లి దీవెన-ప్రార్థనలు చేసిన ముస్లీంలు- అద్వానీ జల్లు

Posted: 09/17/2013 06:45 PM IST
Mothers blessings modi muslims pray on his 64th birthday

64వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. జీవితంలో మరింతగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మోడీని తల్లి దీవించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ పుట్టినరోజున తల్లి నుంచి దీవెనలు అందుకోవటం జీవితంలో మరుపురాని రోజుగా ఆయన అభివర్ణించారు. ప్రజల ఆశీర్వాదాలు వృధా కావని తాను నమ్ముతానని...వారి ఆశీసులు తనకు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు. నేడు విశ్వకర్వ జయంతి కూడా అని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనెల 13న నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

నరేంద్ర మోడీ కోసం ముస్లింల ప్రార్థన

మతతత్వవాదిగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సంతోషం కలిగించే విషయమిది. మోడీ 64వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన కోసం వందలాది ముస్లింలు ప్రార్థనలు చేయనున్నారు. మహీం దర్గాగా ప్రఖ్యాతిగాంచిన ముంబైలోని చారిత్రక మఖ్ దూమ్ షా బాబా సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించనున్నారు. 'మోడీకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మహీం దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహిస్తున్నాం . భారత ప్రధాని అయ్యేలా ఆశ్వీరదించాలని కోరనున్నట్లు" అని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు హైదర్ అజాం తెలిపారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశీష్ షెలార్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది కార్యకర్తలు పాల్గొననున్నారు. పేదలకు అన్నదానం చేయనున్నారు. మోడీ జన్మదినాన్ని పురష్కరించుకుని 63 బెలూన్లను ఎగురవేశారు. కాగా రాజస్థాన్ లోని చారిత్రక అజ్మీర్ దర్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ ప్రధాని కావాలంటూ ప్రార్థనలు చేశారు.

 

అద్వానీ ప్రశంసల జల్లు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై అలకబూనిన ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కాస్త మెత్తబడ్డారు. అంతేకాదు మోడీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ ఎనలేని కృషి చేశారని, అన్ని గ్రామాలకూ 24 గంటలూ విద్యుత్ సరఫరా అందిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం గుజరాత్ అని, ఈ ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అద్వానీ పాల్గొన్న పార్టీ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. పార్టీ సూచించిన ప్రకారం మోడీ దేశ పాలనా బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నట్లయితే.. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేపట్టిన మంచి పథకాలను, అభివృద్ధిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని అద్వానీ చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more