Gold telangana state will have 24 districts

Gold Telangana state will have 24 districts, reate 24 districts in separate Telangana, kcr demand 24 district in telangana, 24 Districts in Telangana state

Gold Telangana state will have 24 districts

24 జిల్లాలతో కూడిన గోల్డ్ టీ కావాలి

Posted: 09/17/2013 02:47 PM IST
Gold telangana state will have 24 districts

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర విభజన తెరపైకి కొత్త ప్రతిపాదనాను తెచ్చిపెట్టాడు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే.. 10 జిల్లాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ కొత్తగా రాష్ట్ర ఏర్పాటు జరిగితే మాత్రం 24 జిల్లాలతో కూడిన బంగారు తెలంగాణ కావాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ కొత్త డిమాండ్ ను తెలంగాణ ప్రజల మద్యకు తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో విభజనకు వ్యతిరేకంగా సీమాంద్రలో ఉద్యమం నడుస్తున్న సమయంలో.. కేసిఆర్ తెరపైకి సరికొత్త డిమాండ్ తీసుకొచ్చారు. 24 జిల్లాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కేసిఆర్ తయరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఏయే జిల్లాలు అవతరిస్తాయి? ఏ ప్రాంతాలు ఏయే జిల్లాల పరిధిలో విలీనమవుతాయి? అనే విశ్లేషణలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వాస్తవానికి తెలంగాణలోని జిల్లా కేంద్రాలు అదే జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏదైనా పనిపడితే.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అక్కడి ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఇందుకు నిలువుటద్దం పడుతున్నాయి.

 

 

వాస్తవానికి జిల్లాల ఏర్పాటుపై ఇప్పటివరకు శాస్త్రీయ విధానమేదీ లేదు. ఎన్ని లక్షల జనాభాకు... లేదా ఎంత విస్తీర్ణముంటే జిల్లాలను ఏర్పాటు చేయాలనే మార్గదర్శకాలేమీ లేవు. జాతీయస్థాయిలో జిల్లాల సగటు వైశాల్యం 5,035 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాల సరాసరి 11,400 చదరపు కిలోమీటర్లు. దేశ సగటుతో పోలిస్తే రెట్టింపు విస్తీర్ణం. పెద్ద జిల్లాలుంటే అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఎక్కువై పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ సేవలు, పథకాలు సక్రమంగా తమకు అందడం లేదని ప్రజల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది.

 

 

ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘24 జిల్లాలతో బంగారు తెలంగాణ’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. రాజకీయ, పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాలను పునర్విభజించాలంటూ ఆ పార్టీ ముందుగానే బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసింది. అయిదు నియోజకవర్గాలకో జిల్లా ఉండాలనే కాన్సెప్ట్‌ను అనుసరించింది. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను ఆరు జిల్లాలుగా విభజించింది. మెదక్‌ను, మహబూబ్‌నగర్‌ను, వరంగల్‌ను మూడు జిల్లాలుగా, నిజామాబాద్ మినహా మిగతా నాలుగు జిల్లాలను రెండేసి జిల్లాలుగా పునర్విభజించింది. ఇప్పటికే కొత్త జిల్లాలపై విసృతతంగా ప్రచారం చేపట్టింది. తెలంగాణ విస్తీర్ణం 1,14,000 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో దేశంలోనే 13వ స్థానంలో నిలుస్తుంది. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాల్లోనూ జిల్లాల సంఖ్య పది కంటే ఎక్కువే ఉంది. బీహార్‌లో 38 జిల్లాలు, పంజాబ్‌లో 22, పశ్చిమబెంగాల్‌లో 19 జిల్లాలు, జార్ఖండ్‌లో 24 జిల్లాలు, ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లాలు, డివిజన్ల పునర్విభజన జరగాలనే డిమాండ్ తెలంగాణ నాయకులు నుండి వెల్లువెత్తుతోంది.

 

ప్రతిపాదిత జిల్లాలు

. హైదరాబాద్ సెంట్రల్

బి. హైదరాబాద్ నార్త్

సి. హైదరాబాద్ ఈస్ట్

లేదా వినోభాబావే

డి. చార్మినార్ లేదా

భాగ్యనగర్

. గోల్కొండ

ఎఫ్. వికారాబాద్

జీ. ఆదిలాబాద్

హెచ్. మంచిర్యాల

. నిజామాబాద్

జె. మెదక్

కె. సంగారెడ్డి

ఎల్. సిద్ధిపేట

ఎం. కరీంనగర్

ఎన్. జగిత్యాల

. ఖమ్మం

ఫి. భద్రాచలం

క్యూ. వరంగల్

ఆర్. భూపాలపల్లి (జయశంకర్ జిల్లా)

ఎస్. ములుగు (సమ్మక్క సారలమ్మ జిల్లా)

టి. మహబూబ్‌నగర్

యు. నాగర్‌కర్నూల్

వి. వనపర్తి

డబ్ల్యూ. నల్లగొండ

ఎక్స్. సూర్యాపేట

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more