Telugu hero fan puts kidney on sale for senior ntr temple

Senior NTR Temple, Telugu Hero Fan puts kidney on sale, Fan puts Kidney for Sale to built NTR temple, NTR fan Penumacha Srinivasulu puts Kidney for sale to build temple for NTR, NTR Fan Penumacha Srinivasulu

Telugu Hero Fan puts kidney on sale for Senior NTR Temple

తన హీరో గుడి కోసం కిడ్నీలు అమ్మకానికి పెట్టిన అభిమాని

Posted: 06/15/2013 07:36 PM IST
Telugu hero fan puts kidney on sale for senior ntr temple

కన్నవారినే ప్రేమించాని ఈ రోజుల్లో .. వెండి తెరపై కనిపించే అభిమాన హీరో కోసం అతని కిడ్నీలను అమ్మటానికి సిద్దమయ్యాడు. తనకు ఆర్థిక స్థోమత లేకున్నప్పటికి అభిమాన హీరో కోసం గుడి కట్టాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన పెనుమచ్చ శ్రీనివాసులు ఎన్టీఆర్‌కు వీరాభిమాని. శ్రీనివాసులు తన స్వగ్రామంలో ఎన్టీఆర్ కోసం ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. తిరుపతి నుంచి విగ్రహాన్ని తెప్పించి గుడిలో పెట్టారు. అయితే శ్రీనివాసులకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో ఆలయ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరూ ముందుకు రాకపోవడం లేదు. దీంతో తన కిడ్నీలు అమ్మి అయినా ఆలయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు శ్రీనివాసులు. కిడ్నీలు అవసరమైన వారు ఎవరైనా తనను సంప్రదిస్తే ఇస్తానంటున్నాడు. ఇంతకీ ఆ అభిమాన హీరో ఎవరు అనుకుంటున్నారా? తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామరావు.

వెండితెరపై నటనతో మాత్రమే కాదు...సమర్థ వంతమైన రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన కోసం అభిమానులు గుడి కట్టడానికి సిద్ధమయ్యారంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఓ అభిమాని ఆయన కోసం గుడి నిర్మించడానికి కిడ్నీలను అమ్మకానికి సిద్ధమయ్యాడు. గుడి నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నాడు. సొంత కుటుంబీకులే.. పదవుల కోసం కొట్టుకుంటూ ఎన్టీఆర్ ను మరిచిన ఈ రోజుల్లో ఒక అభిమాని ఇలాంటి సాహసం చెయ్యటం చాలా విశేషం. తెలుగు జలందరికి ఆదర్శంగా నిలిచారు. ఏవరైన విగ్రహాన్ని, గుడి కట్టాలంటే .. ముందుగా విరాళల దాతల కోసం వెతకుంటారు. కానీ ఈ శ్రీనివాసులు మాత్రం స్వయంగా ఆయనే దాతగా మారి, కిడ్నీలు అమ్మాకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో పొంగిపోయి.. ఎన్టీఆర్ గుడికోసం ఆయన అభిమానులు చెయ్యికలపాటానికి రెఢీ అవుతున్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎన్టీఆర్ అభిమానాన్ని చూస్తే అర్థం అవుతుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more