Campus selections in tihar jail

tihar jail, campus selections, rehabilitation of prisoners, jobs for prisoners, prisoners good conduct

campus selections in tihar jail

జైల్లో కాంపస్ సెలక్షన్

Posted: 04/10/2013 08:02 AM IST
Campus selections in tihar jail

జైల్లో పెట్టటమంటే కేవలం నేరానికి శిక్షగా మాత్రమే కాదు వారిలో పరివర్తన రావలన్నది కూడా ధ్యేయమే.  పరివర్తన వచ్చి వాళ్ళు నాగరికులుగా బయట ప్రపంచంలో మెలగగలరనే నమ్మకం కలిగినప్పుడు వాళ్ళకి బ్రతకటానికి ఒక దారి చూపించటం కూడా అవసరమే.  బయటకు పోయి ఏ దారి లేక మళ్ళీ నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే వాళ్ళని జనజీవన స్రవంతిలోకి వచ్చే మార్గాన్ని సుగమం చెయ్యాలి.  అటువంటి ప్రయత్నమే ఢిల్లీలోని తీహార్ జైల్లో జరిగింది.

నిన్న తీహార్ జైల్లో నిర్వహించిన కాంపస్ సెలక్షన్స్ లో హాజరైన 15 కంపెనీలు 30 మంది ఖైదీలను ఉద్యోగానికి ఎంపిక చేసాయి.  నిజానికి 30 కంపెనీల నుంచి కాంపస్ సెలక్షన్స్ నిర్వహించవలసివుండగా 15 కంపెనీల ప్రతినిధులే హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించారు.  ఎంపికైన ఉద్యోగులలో సేల్స్ మెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మార్కిటింగ్ ఇతర ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. 

పోయిన సంవత్సరం తీహార్ జైల్ నుంచి 142 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు.  అందులో సంవత్సరానికి 3.6 లక్షల ప్యాకేజి పొందినవారు కూడా ఉన్నారు.  12000 మంది ఖైదీలున్న పశ్చిమ ఢిల్లీ లోని తీహార్ జైల్ లో కరడుగట్టిన ఉగ్రవాదులు, భారీ అవినీతికి పాల్పడ్డవారితో సహా ఎంతో మంది జైలు శిక్షననుభవించారు.  అందులో నడవడిక బావుండి, వచ్చే ఆరునెలలలో విడుదల కానున్న ఖైదీలకు, విద్యార్హతలుండి ఉద్యోగం చెయ్యగలిగే వయసులో ఉన్నవారి కోసం 2010 నుంచి ఖైదీల పునరావాస యోజనలో ఇలా క్యాంపస్ సెలక్షన్స్ ని నిర్వహిస్తూ వస్తున్నారు. 

ఇక, నియమాలకనుగుణంగా, ఖైదీల ముద్రవేసుకుని ఉండకుండా వాళ్ళకి ఉద్యోగులుగా సమాజంలో గుర్తింపు రావటం కోసం వారి గత చరిత్రను, గుప్తంగా ఉంచుతారు.  ఒకసారి నేరం చేసినంత మాత్రాన జీవితాంతం నేరస్తుడిగానే ఉండకుండా సామాన్య జీవన స్రవంతిలో కలిసిపోయే విధానాలలో క్యాంపస్ సెలక్షన్స్ ఒకటి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more