Railway budget 2013 14 and andhra pradesh

railway budget 2013-14 and andhra pradesh, railways are planning to introduce about 100 trains, including ac double deckers, andhraprades,

railway budget 2013-14 and andhra pradesh.Railways are planning to introduce about 100 trains, including AC double deckers, new passenger services and extension of services to cater to the demands of various states in the Rail Budget 2013-14

railway-budget.gif

Posted: 02/24/2013 01:16 PM IST
Railway budget 2013 14 and andhra pradesh

Railway Budget 2013 14 For Andhra Pradesh

త్వరలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ఈసారి రాష్ట్రానికి మొండి చెయ్యి తప్పదని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ కార్యదర్శి పి స్వామిచరణ్ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలు పంపవద్దని అధికారులకు రైల్వేశాఖ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. మహిళా ఉద్యోగినుల సమావేశంలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వచ్చిన స్వామిచరణ్ విలేఖర్లతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం రైల్వేబడ్జెట్‌పై కసరత్తు చేయాల్సిన రాష్ట్ర ఎంపిలు ఆలస్యంగా మేల్కొన్నారన్నారు. కొత్త ప్రాజెక్టు కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. వచ్చే రైల్వే బడ్జెట్‌లో చార్జీల మోత తప్పదని హెచ్చరించారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన ప్రాజెక్టులకే ఇప్పటికీ మోక్షం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేశాఖ ఏటా కోటి మాత్రమే ఖర్చు పెట్టే ఉద్దేశంలో ఉందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల క్రితం రైల్వే స్థలం లేని వరంగల్‌లో వ్యాగన్ ఫ్యాక్టరీని ప్రతిపాదించారని, నేటికీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరగలేదన్నారు. వరంగల్‌లో స్థలాన్ని సేకరించకపోతే ఫ్యాక్టరీ వెనక్కిపోయే అవకాశం ఉందని, తద్వారా వెయ్య మం ది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీని ప్రతిపాదించారని, తరువాత దానిని పంజాబ్‌లోని కపుర్తకు తరలించేశారని స్వామిచరణ్ గుర్తుచేశారు. రాజమండ్రిలో రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్, లిఫ్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ఈవిషయంలో స్థానిక ఎంపిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

pawan_kumar_bansal

విజయవాడ డివిజన్ ఆదాయ ఆర్జనలో ముందంజలో ఉన్నా సౌకర్యాల విషయంలో వెనుకంజలో ఉందన్నారు. విజయవాడ డివిజన్ ఏటా 2500కోట్ల ఆదాయాన్ని సాధిస్తోందన్నారు. ఈసారి బడ్జెట్‌లో కాకినాడ-డిల్లీ, కోస్తాంధ్ర నుంచి రాజస్థాన్‌కు, కాకినాడ-బెంగుళూరుకు ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, కాకినాడ-హైదరాబాద్ మధ్య రాత్రిపూట ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. త్వరలో 8వేల కిందిస్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత రైల్వే ట్రాక్‌లను 150శాతం వినియోగిస్తున్నారని, కొత్త రైళ్లను నడిపేందుకు 3వ ట్రాక్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు లక్షా 50వేల కోట్లు అవసరమవుతాయని స్వామిచరణ్ చెప్పారు. ఇంత ఖర్చును భరించే స్థితిలో రైల్వేశాఖ లేదని, రైల్వేలను ప్రైవేటుపరం చేసే యోచనలో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగే రైల్వే గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్‌కు ఎదురుండదని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన యూనియన్‌కే గుర్తింపు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb blast investigations in progress
Two foreign nationals held near nepal border  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more