Two foreign nationals held near nepal border

foreign nationals, raxaul, bihar, mohammad abdul and abdullah umar makrani, indo-nepal border, hyderabad blasts, hyderabad dilsukhnagar bombl blast case, 2 suspected persons arrested, nepal boundaries, mahammad adam and mahammad abdullah umar makrani, immigration officials,

two foreign nationals held near Nepal border.Two foreign nationals were arrested in East Champaran district of north Bihar on Saturday, when they were allegedly trying to sneak into Nepal from the Indian side of the international border

two-foreign.gif

Posted: 02/24/2013 01:00 PM IST
Two foreign nationals held near nepal border

2 foreign nationals held near Nepal border

దేశంలో సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరిని నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. పేలుళ్ళ సంఘటనపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందాలు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్, నేపాల్ సరిహద్దులో ఇద్దరు అనుమానితుల్ని అక్కడి రాక్సల్ ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టు వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని బీహార్ తూర్పు చంపరాన్ పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించి ఖాట్మండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆదాంగా, రెండో వ్యక్తిని సోమాలియాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఓమన్‌గా గుర్తించారు. వీరివద్ద ఉన్న లాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫొటోలు, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఫొటోలు, కొన్ని వీడియో ఫుటేజ్‌లు వారి వద్ద ఉన్న కెమెరాలో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితుల కోసం దేశ సరిహద్దులను అప్రమత్తం చేయడంతోపాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాలు సందేశాలు పంపించడంతో అప్రమత్తమయ్యారు. వీరిద్దరి వద్ద ఫొటోలు దొరకడం, అక్రమంగా నేపాల్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కారణంతో అనుమానితులుగా విచారిస్తున్నారు.

2 foreign nationals held near Nepal border

హైదరాబాద్ పేలుళ్లతో వీరికి ఏదైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. వీరిద్దరినీ బీహార్‌లోని పూర్వి చంపరన్ జిల్లా పోలీసులకు సరిహద్దు భద్రత దళం సిబ్బంది అప్పగించడంతో అక్కడ విచారణ జరుగుతోంది. వీరినుంచి లాప్‌టాప్, మొబైల్, కెమెరా, డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు ఢిల్లీనుంచి రైల్లో బయలుదేరి బీహార్‌లోని రాక్సుల్ స్టేషన్‌లో దిగారు. ఢిల్లీకి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరి వెళ్లినట్టు విచారణ అధికారులు భావిస్తున్నారు. సోమాలియన్ దేశస్థుడు మహ్మద్ అబ్దుల్లా ఓమన్ (25)ను బీహార్ పోలీసులు ప్రశ్నించగా తాను జర్మన్ దేశస్ధుడినని, తాను రెండోసారి భారత్‌కు వచ్చానని వివరించాడు. ఖాట్మండ్ మీదుగా ఈ ఏడాది జనవరిలో భారత్‌కు వచ్చానని చెప్పాడు. హైదరాబాద్‌కు చెందిన ఆదాం మాత్రం తన తండ్రి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్టు తెలిపాడు. అయితే ఓమన్‌తోపాటు ఖాట్మండ్ ఎందుకు వెళ్తుందీ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫొటోలు, హైదరాబాద్ ఫొటోలు, మ్యాప్‌లను ఎందుకు తమవెంట తీసుకువెళ్తున్నదీ వారు విచారణలో సరిగ్గా వివరించకపోవడంతో వారిపై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway budget 2013 14 and andhra pradesh
Ten lakh reward for information on hyderabad blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more