సైకిల్ అంటే చక్రం. అయితే వాడుక భాషలో బైసైకిల్ (రెండు చక్రాల బండి) ని సైకిల్ అని పిలుస్తున్నాం. దానికి ఎటువంటి మోటార్లు, ఇంధన సమస్య లేకుండా, కేవలం పిక్కబలంతోనే నడిపే బండ్లు అవటం వలన వీటిని ఇప్పటికీ కొంత మంది సొంత పనుల మీద వెళ్ళటానికి ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు మోజుపడి నడుపుతుండటం, సైకిల్ తో క్రీడలు జరుగుతుండటం వలన ఇంకా అంతరించిపోకుండా బతికే ఉన్న వాహనం రెండు చక్రాల సైకిల్. అది తెలుగు దేశం పార్టీకి ఎన్నికల గుర్తు అవటంతో మన రాష్ట్రంలో ముందు అధికార పక్షం తర్వాత ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకుంది సైకిల్.
మోటార్ వాహనాల చట్టం మోటారు లేని వాహనాలకు (రెండు లేక మూడు చక్రాల బండ్లు) వర్తించదు. అందువలన స్కూటర్, మోటర్ సైకిల్ కారు, ఆటోలలాగా సైకిళ్ళను రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు. కానీ వాటికీ రిజిస్ట్రేషన్ అవసరం పడబోతోంది. అంతే కాదు ఇప్పటికే మీ దగ్గర సైకిలు ఉంటే ఆ పాత సైకిల్ కు కూడా రిజిస్ట్రేషన్ అవసరమన్న నియమం త్వరలో రాబోతోంది. మోటార్ వాహనాల చట్టం వర్తించదు కనుకనే ఆ బండ్లు ట్రాఫిక్ లో రాంగ్ సైడ్ లో పోతున్నా దానికి కేసు లేదు. ఒకప్పుడు సైకిల్ మీద ఇద్దరు ఎక్కినట్లయితే కేసులుండేవి, లేదా సైకిల్ కి లైటు లేకపోయినా పోలీసు పెట్టీ కేసు పెట్టేవారు. సైకిల్ వెనుక ఎర్రరంగులో ప్రతిబింబించేది పెట్టాలనే నియమం ప్రస్తుతం ఉంది కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదెవరూ. అయితే, సైకిల్ రిజిస్టేషన్ తోపాటుగా ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ వారి ధృవీకరణ లాంటివేమీ అవసరం లేదు లెండి, భయపడకండి. నివాస ధృవీకరణ పత్రాలతో సైకిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. కొత్తది కొంటే అదే సమయంలోనూ, పాతదయితే కొంత గడువు లభిస్తుంది అలా రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి.
ఉన్నట్టుండి ఈ గొడవేమిటా అనుకుంటున్నారా. ఉగ్రవాదుల మహిమ. రాజస్తాన్ లోనూ, పుణె లోనూ, మొన్న దిల్ సుఖ్ నగర్ లోనూ పేలిన బాంబులు సైకిల్ లో పెట్టినవే. రిజిస్ట్రేషన్ ఉంటే దాని ద్వారా ఆరా తియ్యటానికి వీలవుతుందని హోంశాఖ అభిప్రాయపడుతోంది. ఇక సైకిల్ పోయిందన్న కేసులూ చిన్న పిల్లల వాడే సైకిల్ కూడా ఇది వర్తిస్తుందా అనే చర్చలు, రిజిస్ట్రేషన్ నంబరు బోర్డు ఏ సైజులో ఉండాలన్న ప్రశ్నలూ మొదలవుతాయి.
ఇక ముందు ముందు లంచ్ బాక్స్ లకు కూడా రిజిస్ట్రేషన్ అవసరం పడుతుందేమో. ఎందుకంటే అందులో కూడా బాంబులు అమర్చిన ఉదంతాలున్నాయి. ఢిల్లీలో 23 సంవత్సరాల క్రితం వివిధ ప్రాంతాల్లో ఒకే సమయంలో 12 చోట్ల రేడియో బాంబులు పేలాయి. చిన్న పోకెట్ రేడియో లో అమర్చిన బాంబులు రోడ్డు పక్కన దొరికితే సామాన్యంగా ఎవరైనా చేసేదేమిటంటే దాన్ని ఆన్ చేసి చూడటం. అదే జరిగింది. ఆన్ చెయ్యగానే పేలేటట్టుగా చేసిన ఏర్పాటు వలన ఆ సమయంలో ఎక్కువ శక్తివంతమైన బాంబులు కాకపోయినా, ప్రాణనష్టమైతే జరిగింది.
ఏది ఏమైనా ఉగ్రవాద చర్యలకు ఏదోవిధంగా చెక్ పెట్టాల్సిందే. కాకపోతే పైశిచక తెలివితేటలతో ఉగ్రవాదులు, అదే పనిలోనే నిరంతరం నిమగ్నమైవుండటం వలన ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more